Allu Arjun అంటే క్రష్.. విజయ్ దేవరకొండ నా కంటే ఛిల్!! ప్రియాంక జవల్కర్ ఓపెన్ కామెంట్స్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే క్రష్ అని ఓపెన్‌గా చెప్పేసింది అనంతపురం హాట్ కేక్ . అంతేకాదు అంతకుముందు ఆమెతో నటించిన కూడా ఎలాంటివాడో చెబుతూ ఓపెన్ అయింది. ఇటీవలే ''తిమ్మరుసు, SR కళ్యాణ మండపం'' అనే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చి సక్సెస్ అందుకున్న ఈ రాయలసీమ బ్యూటీ.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తనతో నటించిన యువ హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నార్త్ ముద్దుగుమ్మలకు పోటీ ఇస్తూ టాలీవుడ్‌లో రాణిస్తున్న అచ్చ తెలుగు భామలు తక్కువే అని చెప్పుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు తెరపై తన మార్క్ చూపిస్తోంది తెలుగమ్మాయి ప్రియాంక జవల్కర్. చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాలు చూస్తూనే పెరిగానని చెబుతున్న ఆమె, అల్లు అర్జున్‌పై ఉన్న ఇష్టాన్ని బయటపెట్టేసింది. ఇక విజయ్ దేవరకొండ తనకంటే కంటే ఛిల్ అంటూ ఆయన క్యారెక్టర్‌పై కామెంట్ చేసింది. అలాగే తనతో కలిసి నటించిన మరో ఇద్దరు హీరోలు సత్యదేవ్ (తిమ్మరుసు), కిరణ్ సబ్బవరం (SR కళ్యాణ మండపం) గురించి కూడా ఆమె మాట్లాడింది. కిరణ్ చాలా ఇన్నోసెంట్ అని, కిడ్‌లా వ్యవహరిస్తుంటాడని, అలాగే సత్యదేవ్ చాలా హార్డ్ వర్కర్ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఓటీటీ ఆఫర్స్ వస్తున్నాయని, స్క్రిప్ట్ నచ్చితే కమిట్ అవుతానని తెలిపింది. అయితే తాను తెలుగు సినిమాలే ఎక్కువగా ఇష్టపడతానని, తనకు తెలిసి ఇండస్ట్రీలో తెలుగు గర్ల్స్ రాణించే రోజులు రాబోతున్నాయని ఆమె చెప్పింది. కోవిడ్ తర్వాత థియేటర్స్ రీ ఓపెన్ చేసిన ఈ సమయంలో తానే మొదటగా రంగంలోకి దిగడం, అది కూడా తన రెండు సినిమాలు ఒక వారం రోజుల గ్యాప్‌లోనే విడుదలవుతుండటంతో చాలా ఆందోళనకు గురయ్యానని చెప్పిన ప్రియాంక.. ఈ రెండు సినిమాలకు హిట్ టాక్ వచ్చి మంచి కలెక్షన్స్ రాబట్టడం ఆనందం కలిగించిందని తెలిపింది.
By August 11, 2021 at 10:04AM
No comments