Prakash Raj: ఆ ఒక్క మాటతో మరోసారి చర్చల్లో ప్రకాష్ రాజ్ ఇష్యూ.. మురళీ మోహన్ మాటలకు స్ట్రాంగ్ కౌంటర్ వేశారా?
Murali Mohan: ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్న అంశం . గత కొద్దిరోజులుగా ఎక్కడ చూసినా ఈ చర్చనే నడుస్తోంది. ఇప్పటికే 'మా' అధ్యక్ష బరిలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, మంచు వారబ్బాయి మంచు విష్ణు, హేమ, సీవీఎల్ నరసింహారావు ఉండగా జీవిత రాజశేఖర్ కూడా దాదాపు తమ పోటీ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే తన ప్యానల్ సభ్యులను కూడా ప్రకటించేసి దూకుడు ప్రదర్శించారు. దీంతో కొందరు సినీ ప్రముఖుల నుంచి సెప్టెంబర్ నెలలో జరగాల్సిన ఎన్నికలకు ఇప్పుడే హడావిడి ఏంటనే విమర్శలు తెరపైకి వచ్చాయి. మరోవైపు ఈ పరిస్థితుల నడుమ 'మా' ఎన్నికలపై చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. ఈ సారి ‘మా’ ఎన్నికల్లో పోటీ అనేది ఉండదని.. ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని మురళీ మోహన్ తెలపడం హాట్ టాపిక్ అయింది. చిరంజీవి, మోహన్ బాబు, జయసుధ తదితరులు పలు దఫాలుగా చర్చలు జరిపి ఎన్నికలు ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆయన తెలపడం సరికొత్త చర్చలకు తెరలేపింది. ఇదిలా ఉంటే ప్రకాష్ రాజ్ పోటీ విషయమై లోకల్, నాన్ లోకల్ ఇష్యూ నడుస్తూనే ఉంది. ఆయన నాన్ లోకల్ పర్సన్ అంటూ కొందరు చేస్తున్న కామెంట్స్ ఓ రేంజ్ చర్చలకు దారి తీశాయి. దీంతో దాదాపు రెండు రోజులకు ఒకసారైనా 'మా' ఎన్నికలకు సంబంధించి ఏదో ఒక అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుండటం చూస్తున్నాం. సెప్టెంబర్‌లో జరగాల్సిన ఎన్నికల రచ్చ ఇప్పుడే మొదలై రాజకీయ వేడిని తలపిస్తోంది. ఇంతలో ఉన్నట్టుండి సడెన్‌గా `ఎలక్షన్స్ ఎప్పుడు?` #justasking అంటూ ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో ప్రశ్నించడం అనేది మరోసారి అందరినీ కెలికినట్టే అని చెప్పుకుంటున్నారు ఫిలిం నగర్ జనం. ఏకగ్రీవం అన్న పదం వినడమే ఇష్టం లేదు కాబట్టే ఇలా `ఎలక్షన్స్ ఎప్పుడు?` అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ పెట్టారని అంటున్నారు. ఇది మురళీ మోహన్ మాటలకు స్ట్రాంగ్ కౌంటర్ అంటున్నారు. ఆయన చేసిన ఈ ట్వీట్ చూసి నెటిజన్లు కూడా విభిన్నమైన వాదనలు వినిపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఒకే ఒక్క ట్వీట్‌తో ప్రకాష్ రాజ్ ఇష్యూ మళ్ళీ చర్చల్లో నిలవడం విశేషం.
By July 07, 2021 at 08:11AM
No comments