Breaking News

Prabhas: యూ స్పాయిల్ మి!! ఆమె కోసం ప్రత్యేకంగా యంగ్ రెబల్ స్టార్‌.. నటి కామెంట్స్ వైరల్


డార్లింగ్ వ్యక్తిత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే. పాన్ ఇండియా స్టార్‌గా కీర్తించబడుతున్నా ఎక్కడా హంగు ఆర్భాటాల జోకిలి పోకుండా సింప్లిసిటీ మెయిన్‌టైన్ చేస్తుంటారాయన. ఇక తన తోటి నటీనటులతో ఎంతో స్నేహంగా మెలిగే ప్రభాస్, అప్పుడప్పుడు వారిని సర్‌ప్రైజ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ న‌టి భాగ్య‌ శ్రీకి ఓ సర్‌ప్రైజ్ పంపించారు ఈ యంగ్ రెబల్ స్టార్. దీంతో ప్రభాస్ పంపిన ఈ గిఫ్ట్ తన ట్విట్టర్ వేదికగా అందరికీ చూపిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు . ప్రభాస్ ఇల్లంటే రుచికరమైన వంటలకు కేరాఫ్ అడ్రస్ అనే టాక్ ఉంది. అప్పుడప్పుడూ షూటింగ్‌లో ఉన్న వారి కోసం ఈ వంటకాలు తెప్పిస్తుంటారు ప్రభాస్. వారింట్లో చేసే గోదావరి వంటకాలంటే నటీనటులకు చాలా ఇష్టం కూడా. అయితే ఈ సారి మాత్రం తన సహ నటి భాగ్య శ్రీ కోసం పూతరేకులు గిఫ్ట్‌గా పంపించారు ప్రభాస్. ఈ గిఫ్ట్ ప్యాక్ అందుకున్న భాగ్య శ్రీ.. ''రుచికరమైన హైదరాబాదీ స్వీట్లు అందాయి. థ్యాంక్స్‌ ప్రభాస్‌. ఈ స్వీట్లు తినిపించి నా అభిరుచిని మార్చేశావు (యూ స్పాయిల్ మి)'' అని కామెంట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా రూపొందుతున్న 'రాధే శ్యామ్' సినిమాలో భాగ్య శ్రీ కీలకపాత్ర పోషిస్తున్నారు. రాధాకృష్ణ రూపొందిస్తున్న ఈ పిరియాడికల్ లవ్ స్టోరీని ఏకంగా ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమాపై రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు.


By July 02, 2021 at 09:43AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/prabhas-send-surprise-gift-to-actress-bhagyashree/articleshow/84056526.cms

No comments