Breaking News

పెగాసస్‌తో కోట్ల మంది సుఖంగా నిద్రపోతున్నారు.. NSO సంచలన వ్యాఖ్యలు


వ్యవహారం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో కేంద్రంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. దేశంలోని 300 మందికిపై రాజకీయ, న్యాయ, వ్యాపార ప్రముఖుల ఫోన్‌లు హ్యాకింగ్‌కు గురయినట్టు ది వైర్ పత్రిక కథనం వెలువరించింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తదితరులు ఈ జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై దుమారం రేగుతున్న వేళ.. ఇజ్రాయేల్‌కు చెందిన స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రాత్రిపూట సుఖంగా నిద్రపోతున్నారంటే అది పెగాసస్‌ వంటి నిఘా సాఫ్ట్‌వేర్‌ల వల్లనేనని ఎన్‌ఎస్‌వో గ్రూపు సమర్థించుకుంది. లక్షల మంది రోడ్లపై సురక్షితంగా తిరిగేందుకు ఇలాంటి టెక్నాలజీ దోహదం చేస్తున్నాయని పేర్కొంది. ఈ టెక్నాలజీని నిర్వహించేది తాము కాదని, క్లెయింట్లు సేకరించే డేటాతో తమకేమీ అందుబాటులో ఉండదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ సంస్థ అధికార ప్రతినిధి వెల్లడించారు. ‘మేం సమకూరుస్తున్న టెక్నాలజీల సాయంతో నిఘా సంస్థలు ప్రపంచంలో అనేక చోట్ల జరుగుతున్న నేరాలు, ఉగ్రవాదంపై దర్యాప్తు చేయగలుగుతున్నాయి. నేరగాళ్లపై నిఘా విధించగలుగుతున్నాయి.. నిగూఢపరిచిన సమాచారాన్ని వెలికితీయడంలోనూ ఇవి కీలకంగా నిలుస్తున్నాయి. ప్రపంచంలో సైబర్‌ నిఘాకు మా సంస్థలాంటివి తోడ్పాటును అందిస్తున్నాయి.. సురక్షితమైన ప్రపంచం కోసం మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాం’ అని వివరించింది. ‘ప్రపంచంలోని అనేక ఇతర సైబర్ ఇంటెలిజెన్స్ కంపెనీలతో కలిసి ఎన్ఎస్ఓ ప్రభుత్వాలకు టెక్నాలజీని అందజేస్తుంది.. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చట్టాన్ని అమలు చేసే సంస్థలు అంధకారంలో ఉన్నాయి.. సోషల్ మీడియా వంటి వేదికల్లో సమాజానికి హానికరమైన చర్యలను పర్యవేక్షించి, నియంత్రించే పరిష్కారం లేదు.. మేం సురక్షితమైన ప్రపంచం కోసం సహకరిస్తున్నాం’ అని పేర్కొంది. అయితే, భారత్‌లో పెగాసస్ స్పైవేర్ దుర్వినియోగం అంశం తమ దృష్టికి వచ్చిందని 2019 అక్టోబరులో పీటీఐకి రాసిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపింది. తీవ్రమైన నేరాలు, ఉగ్రవాదాన్ని నిరోధించడానికి కాకుండా మా ఉత్పత్తులను ఇతర కార్యక్రమాలకు వినియోగించడం ఇది ఒప్పందపరంగా నిషేధం అని పేర్కొంది. ఒకవేళ అటువంటి దుర్వినియోగం మేం గుర్తిస్తే చర్యలు తీసుకుంటాం.. ఈ టెక్నాలజీ జీవించే హక్కు, భద్రత, శారీరక సమగ్రతతో సహా మానవ హక్కుల పరిరక్షణలో పాతుకుపోయింది.. అందువల్ల మా ఉత్పత్తులు మానవ హక్కులు, వ్యాపారం విషయంలో ఐక్యరాజ్యసమితి మార్గదర్శక సూత్రాలపై ఆధారపడి ఉంటాయి’అని తెలిపింది. సాఫ్ట్‌వేర్‌ను భారత్‌కు నికి విక్రయించినట్లు ధ్రువీకరిచండం లేదా తిరస్కరించడం గానీ చేయని ఎన్ఎస్ఓ.. ‘ఉగ్రవాదం, తీవ్రమైన నేరాలను నిరోధించడం, దర్యాప్తు అనే ఏకైక ఉద్దేశంతో ప్రభుత్వ నిఘా, చట్టబద్ధమైన సంస్థలకు లైసెన్స్ పొందింది’ అని పేర్కొంది. ‘తమన్సీ కస్టమర్లుగా కొనసాగుతున్న దేశాల ప్రజా భద్రతా కార్యకలాపాలను రక్షించడానికి, చట్టపరమైన, ఒప్పంద పరిమితులకు ఎవరు అతీతులు కాదు.. సాంకేతిక పరిజ్ఞానం నిర్దిష్ట ఉపయోగాలను చర్చించలేరు’ అని లిఖితపూర్వక ప్రకటన పేర్కొంది.


By July 25, 2021 at 08:25AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pegasus-helps-millions-to-sleep-well-at-night-walk-safely-on-streets-says-nso/articleshow/84722721.cms

No comments