KTR: మరీ ఇంత దారుణమా? పరిష్కారం మీరే చూపాలంటూ రష్మి తీవ్ర ఆవేదన.. మంత్రి కేటీఆర్‌కి రిక్వెస్ట్
బుల్లితెర యాంకర్‌గా జబర్దస్తీ చేస్తూ అప్పుడప్పుడూ వెండితెరపై తళుక్కున మెరుస్తున్న యాంకర్ తాజాగా ఓ విషయమై తీవ్ర ఆవేదన చెందింది. తన ప్రోగ్రామ్స్, షూటింగ్స్ తదితర కార్యక్రమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ నిత్యం పలు విషయాలపై రియాక్ట్ అవుతుంటుంది ఈ జబర్దస్త్ యాంకర్. ఈ నేపథ్యంలోనే తీవ్ర ఆవేదనతో తాజాగా మంత్రి కేటీఆర్‌ని ట్యాగ్ చేస్తూ ఓ రిక్వెస్ట్ చేసింది రష్మి. ఈ సృష్టిలోని మూగ జీవాలంటే రష్మికి ఎంతో ఇష్టం. మూగ జీవులను రక్షించే బాధ్యత మనుషులపై ఉందని ఇప్పటికే పలుసార్లు సూచించింది రష్మి. మూగ జీవాలన్నాక చిన్న పెద్ద అనే తేడాలేదని, సృష్టి లోని జీవాలన్నింటినీ కాపాడుకోవాలంటూ పలు సందర్భాల్లో ఆమె చెప్పుకొచ్చింది. ఈ సృష్టిలోని మూగ జీవాలను ఏ చిన్న హాని కలిగిందని తెలిసినా ఓ జంతు ప్రేమికురాలిగా వెంటనే దాన్ని ఖండిస్తూ వస్తోంది రష్మి. లాక్ డౌన్ వేళ అంతా అన్నదానాలు, ఆర్ధిక సాయాలు చేస్తుంటే రష్మి మాత్రం మూగ జీవాల ఆకలి తీర్చింది. వీధి కుక్కలకు స్వయంగా ఆహారం పంచుతూ వాటిపై ప్రేమను చాటుకుంది. అయితే కొంతకాలంగా హైదరాబాద్ (GHMC) పరిధిలో వీధి కుక్కల సంతతిని తగ్గించేందుకు గాను వీధుల్లోని శునకాలకు వైద్య సిబ్బంది ఆపరేషన్ చేసి అలాగే వదిలేస్తున్నారు. ఆపరేషన్ తర్వాత చేయాల్సిన చికిత్స చేయకుండానే రోడ్లపై విడిచి పెడుతున్నారు. ఈ విషయాన్ని ‘సేవ్ యానిమల్స్ ఇండియా’ అనే ట్విటర్ ఖాతా ద్వారా ఓ నెటిజన్ కొంతకాలంగా ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ సదరు వీధికుక్కల ఫొటోస్ కూడా పోస్ట్ చేస్తున్నాడు. ఇది రష్మి కంటపడటంతో వెంటనే ఆమె మంత్రి కేటీఆర్ సాయం కోరింది. GHMC పరిధిలోని శునకాలకు ఏబీసీ (యానిమల్ బర్త్ కంట్రోల్) వారు ఆపరేషన్ చేసి అలాగే వదిలేస్తున్నారని, దీనికి సరైన పరిష్కార చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌కి రిక్వెస్ట్ పెట్టింది. మరోవైపు, కొంతమంది వైద్య సిబ్బంది తమ రోజువారీ టార్గెట్ రీచ్ కావడం కోసం ఇలా నోరులేని జీవాలను హింసించడం సరికాదని అభిప్రాయం జనాల నుంచి వ్యక్తమవుతోంది. చూడాలి మరి రష్మి రిక్వెస్ట్‌పై కేటీఆర్ రియాక్షన్ ఎలా ఉంటుందనేది!.
By July 30, 2021 at 08:47AM
No comments