HBD Suriya: డబ్బింగ్ కా బాప్.. సౌత్ ఇండియన్ తెరపై హవా నడిపిస్తున్న స్టార్ హీరో
నేటితరం హీరోల్లో సూర్యకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. తమిళ సినీ నటుడు శివకుమార్ పెద్ద కుమారుడైన సూర్య.. 1997లో 'నెరుక్కు నేర్' అనే తమిళ సినిమాతో అరంగేట్రం చేసి అంచెలంచెలుగా ఎదిగారు. కేవలం తమిళ నాట మాత్రమే కాదు.. తెలుగులోనూ స్టార్ హీరోగా కీర్తించబడుతున్న ఘనత సొంతం. మొదటి నుంచి డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూ వస్తున్న ఆయన, డబ్బింగ్ కా బాప్ అనిపించుకుంటూ హవా నడిపిస్తున్నారు. ''గజినీ, సింగం'' లాంటి సినిమాల్లో తనదైన నటనతో మెప్పించి తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు హీరో సూర్య. ఇప్పటికీ సూర్య సినిమా వస్తోందంటే తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. టాలీవుడ్ స్టార్ హీరో సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో సూర్య సినిమాలకు కూడా అలాంటి రెస్పాన్స్ ఉండటం చూస్తున్నాం. ఓ వైపు సినిమాల నిర్మాణంలో భాగమవుతూనే మరోవైపు వరుస సినిమాల్లో నటిస్తున్నారు సూర్య. కెరీర్ పరంగా ఫుల్ ఫేమ్ అయి మంచి ఫ్యాన్ బేస్ కూడగట్టుకున్న సూర్య పుట్టిన రోజు ఈ రోజు (జులై 23). దీంతో ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సూర్య అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు బర్త్ డే విషెస్ పోస్ట్ చేస్తున్నారు. కాగా సూర్య పుట్టినరోజు కానుకగా ఆయన 40 సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సూర్య సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. డి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. సూర్య ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ సౌత్ ఇండియన్ ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటూ ప్రత్యేకంగా ఆయనకు బర్త్ డే విషెష్ చెబుతోంది 'తెలుగు సమయం'.
By July 23, 2021 at 08:29AM
No comments