HBD Sitara: తన గారాలపట్టికి మహేష్ బాబు స్పెషల్ విషెస్.. నమ్రత పోస్ట్ వైరల్
ఈ రోజు (జులై 20) గారాల పట్టి . 2012 సంవత్సరంలో మహేష్- దంపతులకు రెండో సంతానంగా జన్మించిన సితార.. నేడు తొమ్మిదో పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విషెస్ పోస్ట్ చేస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో తాజాగా తన గారాలపట్టికి స్పెషల్ విషెస్ చెబుతూ ఆకాశమంత ప్రేమ కురిపించారు మహేష్ బాబు, నమ్రత. ''నా చిట్టితల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నా ప్రపంచంలో ఎల్లప్పుడూ కొత్త వెలుగులు నింపేది నువ్వే. హ్యాపీ 9! నువ్వు ఊహించిన దానికంటే అమితంగా ప్రేమిస్తున్నా'' అని పేర్కొంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. అదేవిధంగా మహేష్ సతీమణి, తల్లి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియా వేదికగా సితార అరుదైన ఫొటోలు పంచుకుంటూ కూతురుకు స్పెషల్ విషెస్ చెప్పింది. చిన్నతనం నుంచి సితార ఎదుగుతున్న ఫొటోలను వీడియోగా రూపొందించి తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన నమ్రత.. ''నీ ఎదుగుదల చూస్తూ ఎంతో ఆనందం పొందుతున్నా'' అని పేర్కొంది. మహేష్, నమ్రత చేసిన ఈ పోస్టులపై నెటిజన్స్ స్పందిస్తూ సితారకు బెస్ట్ విషెస్ చెబుతున్నారు. ఎప్పుడూ షూటింగ్స్, బిజినెస్ వ్యవహారాలతో బిజీ బిజీగా గడిపే మహేష్ బాబు వీలు కుదిరినప్పుడల్లా తన ఫ్యామిలీతో జాలీ ట్రిప్స్ వేస్తుంటారు. సతీమణి నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలను వెంటబెట్టుకొని విదేశాలు చుట్టి వస్తుంటారు. ఇంట్లో కూడా పిల్లలతో చాలా సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు మహేష్. ఇకపోతే చిన్న వయసులోనే తన చలాకీతనంతో స్పెషల్ ఫాలోయింగ్ కూడగట్టుకొని తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది సితార. సోషల్ మీడియాలో సితారకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండటమే గాక ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉండటం విశేషం.
By July 20, 2021 at 10:38AM
No comments