పోసాని కృష్ణమురళికి కరోనా పాజిటివ్.. ఆయన భార్యకు కూడా! ఆసుపత్రిలో చికిత్స
మహమ్మారి ఉదృతితో ఇప్పటికే సినీ ఇండీస్ట్రీ కకావికలం అయింది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తాకిడిలో కొందరు సినీ నటులు కన్నుమూయగా, ఎంతోమంది యాక్టర్స్ కోవిడ్ బారినపడి తిరిగి కోలుకున్నారు. అయితే రీసెంట్‌గా కరోనా సెకండ్ వేవ్ ముగిసిందని ఉపిరిపీల్చుకున్న జనానికి.. ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ టెన్షన్ పట్టుకుంది. కొత్త కొత్త వేరియంట్లు వెలుగులోకి వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల నడుమ తాజాగా తనకు, తన కుటుంబసభ్యులకు కరోనా సోకిందని అధికారికంగా తెలిపారు నటుడు . గత కొన్నిరోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న పోసాని కృష్ణమురళి.. ఇటీవల ఆరోగ్య పరీక్షలు చేయించుకోగా ఆయనకు కరోనా అని తేలింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులందరికీ కరోనా పాజిటివ్ టెస్ట్ చేశారు. వాళ్లకు కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో అంతా గచ్చిబౌళిలోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన పోసాని.. తనకు సినిమా అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలు, హీరోలను క్షమించమని కోరారు. కరోనా రావడం వల్ల తాను నటిస్తున్న రెండు పెద్ద సినిమాల షూటింగ్స్ వాయిదా పడ్డాయని, తన వల్ల సినిమా షూటింగ్స్ ఆగిపోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు పోసాని కృష్ణమురళి. తనను మనస్ఫూర్తిగా మన్నించాలని నిర్మాతలకు విజ్ఞప్తి చేశారు. ప్రేక్షకులు, సినీ పరిశ్రమ ఆశీస్సులు, దేవుడి దయవల్ల త్వరలోనే కోలుకొని పూర్తి ఆరోగ్యంతో మళ్లీ షూటింగ్‌లకు హాజరవుతానని ఆయన తెలిపారు.
By July 30, 2021 at 07:07AM
No comments