ఆయనతో కలిసి ఒక్క సీన్ చేయాలని ఉంది.. కార్తీక్ రత్నం లేటెస్ట్ కామెంట్స్
‘కార్తీక్ రత్నం’.. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన ఈ పేరు మారుమోగిపోతుంది. విభిన్నమైన, విలక్షణమైన కథలను ఎంపిక చేసుకుంటూ.. కార్తీక్ చాలాకాలంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే వస్తున్నారు. అనగానే 'కేరాఫ్ కంచరపాలెం' సినిమా గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత ‘అర్థ శతాబ్ధం’ సినిమాతో కూడా ఆయన మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఒక విలక్షణమైన పాత్ర చేయాలి అంటే కార్తీక్‌కే అది సాధ్యం అవుతుందనే రేంజ్ సాధించారు. తాజాగా హీరోగా, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ‘’ సినిమాలో కూడా ‘మునికన్న’ అనే పాత్రలో కార్తీక్ నటించారు. చేసిన పాత్ర చిన్నదే అయినా.. కథ మొత్తం దాని చుట్టే తిరుగుతుండటంతో.. కార్తీక్ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. దీని తర్వాత ఆయనకు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో రూపొందే సినిమాల కోసం ఆయనను తీసుకుంటున్నారు. ఆ తరహా పాత్రలు ఆయనకు బాగా నప్పుతుండటమే అందుకు కారణం. తాజాగా ఆయన తన కెరీర్‌కి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో తనకు ఎంతో మంది ఇష్టమైన నటులు ఉన్నారు అని.. అందులో అందరికంటే ఎక్కువగా న్యాచురల్ స్టార్ అంటే తాను ఎంతో ఇష్టపడతానని కార్తీక్ పేర్కొన్నారు. నాని నటన అంటే తనకు ఎంతో ఇష్టమని ఆయన స్పష్టం చేశారు. నానితో కలిసి కనీసం ఒక సీన్‌లో అయినా నటించే అవకాశం తనకు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. దీంతో కార్తీక్ కోరిక త్వరలోనే తీరాలని అభిమానులు ఆశిస్తున్నారు.
By July 25, 2021 at 03:31PM
No comments