హ్యాండిచ్చిన ప్రియుడు.. పగతో రగిలిపోయిన ప్రియురాలు ఏం చేసిందంటే..
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
![](https://telugu.samayam.com/photo/84287295/photo-84287295.jpg)
తనను మోసం చేసిన ప్రియుడిపై ప్రతీకారంతో రగిలిపోయిన ఓ యువతి.. అతడికి ఎలాగైనా బుద్ది చెప్పాలని భావించింది. ఇందుకు తన స్నేహితుడి సాయం తీసుకుంది. మాజీ ప్రియుడి కారును అద్దెకు తీసుకుని రోడ్లపై రెండు రోజుల పాటు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ కారును నడిపింది. అయితే, చివరికి ఆమె ప్లాన్ బెడిసికొట్టి కటకటాలపాలైంది. ఈ ఘటన తూర్పు చైనాలోని షావోజింగ్‌లో చోటుచేసుకుంది. లావ్ అనే యువతి.. కియాన్ అనే యువకుడు ప్రేమించకున్నారు. అయితే, లావ్‌ను కొద్ది రోజుల కిందట దూరం పెట్టిన ప్రియుడు.. మరో అమ్మాయికి దగ్గరయ్యాడు. ఈ విషయం లావ్‌కు తెలియడంతో అతడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. దీంతో అతడి కారును అద్దెకు తీసుకొని రెండ్రోజులపాటు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ రోడ్లపై చక్కర్లు కొట్టింది. 49 సార్లు రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు కారును ఆపకుండా వెళ్లడం, ఒకసారి ఓవర్‌స్పీడ్‌గా నడిపిస్తూ మొత్తం 50 సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించింది. తన స్నేహితుడు జుహ్ ద్వారా లావ్ తన మాజీ ప్రియుడి ఆడి కారును అద్దెకు తీసుకుంది. ట్రాఫిక్ ఉల్లంఘనల వల్ల పోలీసులు తన మాజీ ప్రియుడికి భారీ జరిమానా విధిస్తారని భావించింది. కానీ, ఆమె వేసిన ప్లాన్ అడ్డం తిరిగింది. జుహ్ తనపేరుతో కారును అద్దెకు తీసుకోవడంతో.. నడిపింది అతడేనని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా అసలు నిజం బయటపెట్టాడు. తన ప్రియుడిపై పగ తీర్చుకోవడానికి లావ్ తన సాయం కోరిందని చెప్పాడు. కియాన్‌కు చెందిన కారును అద్దెకు తీసుకొచ్చి.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాలని చెప్పిందని వెల్లడించాడు. ఈ విషయంలో నాకు సాయం చేస్తే తనతో డేటింగ్‌కు వస్తానని లావ్ ఆఫర్ ఇవ్వడం వల్ల సహకరించానని తెలిపాడు. దీంతో పోలీసులు లావ్‌ను అదుపులోకి తీసుకున్నారు. థాయ్‌లాండ్‌లోనూ ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. మాజీ ప్రియుడిపై పగతో అతడికి తాను కొనిచ్చిన బైక్‌కు యువతి నిప్పంటించింది. కొనొక్ వాన్ అనే థాయ్‌లాండ్ యువతి.. తన ప్రియుడికి రూ.23 లక్షల ఖరీదైన ఈ బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది. అయితే, ఆమెపై మోజు తీరిపోవడంతో ప్రియుడు బ్రేకప్ చెప్పాడు. అతడు చేసిన మోసానికి ప్రతీకారంతో రగిలిపోయిన కొనొక్ వాన్.. బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పటించింది. ఈ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యింది.
By July 10, 2021 at 09:42AM
No comments