Breaking News

దగ్గుబాటి, మెగా వారసుల ఫైట్.. సెట్స్‌పై పవన్‌తో రానా! ట్రెండ్ అవుతున్న పవర్ స్టార్ లేటెస్ట్ ఇష్యూ


కరోనా సెకండ్ వేవ్ తగ్గి బయట పరిస్థితులు కాస్త కుదుటపడటంతో ఒక్కొక్కటిగా స్టార్ హీరోల సినిమాలు సెట్స్ మీదకొస్తున్నాయి. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్స్ మొదలు పెడుతున్నాడు మేకర్స్. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్- దగ్గుబాటి కాంబోలో రాబోతున్న మల్టీస్టారర్ సినిమా షూటింగ్ నిన్న (సోమవారం) తిరిగి ప్రారంభమైంది. దీంతో సామాజిక మాధ్యమాల్లో #PSPKRanaMovie అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగు రీమేక్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ప్రారంభమైన ఈ షెడ్యూల్‌లో రానా- పాల్గొన్నారు. వాళ్ళిద్దరితో ఓ ఫైట్ సీన్ షూట్ చేస్తున్నారట. ఈ మేరకు సెట్స్‌పై ఉన్న పవన్ లేటెస్ట్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజా అప్‌డేట్స్ వెండితెరపై దగ్గుబాటి, మెగా వారసుల కాంబోను ఎప్పుడెప్పుడు చూడాలా అనే కుతూహలాన్ని పెంచేస్తున్నాయి. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్స్‌మెంట్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ షూటింగ్ అంతా జరగనుంది. సాయి పల్లవి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. థమన్ బాణీలు కడుతున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. కాగా పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించడంపై రియాక్ట్ అయిన రానా.. ''సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్‌తో కలిసి నటించాను. కానీ.. మన పవర్ స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం చాలా సంతోషంగా అనిపిస్తోంది'' అని పేర్కొన్నారు. ఈ మూవీపై మెగా, దగ్గుబాటి ఫ్యాన్స్ ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు.


By July 13, 2021 at 08:32AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/pspkranamovie-trending-pawan-kalyan-and-rana-daggubati-joined-in-shooting/articleshow/84365814.cms

No comments