ఆ సమయంలో అనుష్క కౌగిలింత.. నా జీవితంలో అదే ఫస్ట్ టైమ్! ఓపెన్‌గా చెప్పేసిన యువ దర్శకుడు
జీవితంలో కొన్ని సంఘటనలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఎన్నేళ్లయినా, ఎంత ఎత్తుకు ఎదిగినా అలాంటి సంఘటనలు మరువలేం. లైఫ్‌లో ముందడుగేస్తున్న కొద్దీ ఆ జ్ఞాపకాలు సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుంటాయి. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు విషయంలో కూడా అలాంటి జ్ఞాపకాలు కొన్ని ఉన్నాయట. అది కూడా టాలీవుడ్ టాప్ హీరోయిన్ రూపంలో. ఈ విషయాన్ని బయటపెడుతూ తాజాగా జరిగిన ఓ ప్రోగ్రాంలో ఓపెన్ అయ్యారు ప్రశాంత్ వర్మ. ‘అ!’ అనే అద్భుతమైన సినిమా తీసి తొలి సినిమాతోనే తన టాలెంట్ బయటపెట్టిన ప్రశాంత్ వర్మ.. దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రెండో సినిమాగా రాజశేఖర్‌తో 'కల్కి' సినిమా చేసి ఆ తర్వాత 'జాంబి రెడ్డి' మూవీ రూపొందించిన ఆయన, తన డైరెక్షన్‌లో ఓ విభిన్నమైన క్వాలిటీ ఉంటుందని నిరూపించుకున్నారు. ఈ నేపథ్యంలో తరుణ్‌భాస్కర్ హోస్ట్‌గా బుల్లితెరపై ప్రసారమవుతున్న 'మీకు మాత్రమే చెప్తా' ప్రోగ్రాంలో పాల్గొన్న ఆయన కెరీర్‌కి సంబంధించిన పలు విషయాలు చెప్పారు. 'అ!' సినిమాకు గాను ఎవరో పెద్ద హీరోయిన్ నుంచి ప్రశంసలు దక్కాయటగా.. అని తరుణ్‌భాస్కర్ అడగ్గానే అనుష్క ఇచ్చిన హగ్, ఆ విశేషాలు చెప్పేశారు ప్రశాంత్ వర్మ. 'అ!' సినిమా ప్రివ్యూ షో చూడడానికి వచ్చినప్పుడు కొన్ని సన్నివేశాలు చూసి తన దగ్గరికి వచ్చి షేక్‌హ్యాండ్ ఇచ్చిన అనుష్క ‘సినిమా సూపర్ హిట్’ అని చెప్పారని తెలిపారు. ఇక సినిమా మొత్తం పూర్తయి విడుదలయ్యాక మళ్లీ తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకున్నారని, అలా తనను హగ్ చేసుకున్న మొదటి అమ్మాయి అనుష్కనే అని ప్రశాంత్ వర్మ అన్నారు. ఆ సమయంలో నా కళ్లలో కన్నీళ్లు ఆగలేదని ఆయన అన్నారు.
By July 20, 2021 at 11:39AM
No comments