Breaking News

మళ్లీ లైమ్‌లైట్‌లోకి హీరోయిన్ త్రిషా.. ఈసారి ఆ స్టార్ హీరోకి జోడిగా..


ఒకసారి వెలుగులోకి వచ్చాక.. దాన్ని అలాగే కాపాడుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగడం హీరోయిన్ల విషయంలో చాలా అరుదుగా జరుగుతుంది. మొదటి సినిమాతో హిట్ సాధించి.. ఆ తర్వాత వరుసగా రెండు, మూడు ప్రాజెక్టులు దక్కించుకున్నా.. కనుమరుగైన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. కానీ, మొదటి సినిమా నుంచి అదేస్థాయిలో ప్రేక్షకులను అలరిస్తూ.. చాలాకాలం స్టార్ హీరోయిన్‌గా వెలుగొంది వాళ్లు కొంతమందే. అలా చాలాకాలం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగిన నటి . ఒక దశాబ్ధకాలం వరకూ తెలుగుతో పాటు.. తమిళ .. కన్నడ .. మలయాళ భాషల్లో ప్రేక్షకులను అలరించిన ఆమె.. గత కొంతకాలంగా మాత్రం సరైన హిట్లు లేక వెలవెలబోతుంది. గత కొంతకాలంగా కేవలం లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే పరిమితమవుతూ.. సరైన హిట్ కోసం ఎదురుచూస్తుంది త్రిషా. అయితే ప్రస్తుతం ఆమె తెలుగులో అవకాశాలు లేనప్పటికీ.. తమిళంలో మాత్రం ఓ అరడజను వరకూ సినిమాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఓ బంగారు అవకాశం త్రిషా గుమ్మం తట్టింది. కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్‌ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలో మరోసారి త్రిషాని హీరోయిన్‌గా ఎంపిక చేశారట. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘పవర్’ అనే సినిమా మంచి సక్సెస్ సాధించింది. అంతేకాదు.. కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు పవన్ కుమార్ దర్శకత్వంలో పునీత్ 'ద్విత్వ' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయనకు జోడీగా త్రిషా నటించనుంది. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానుంది.


By July 27, 2021 at 10:19PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/heroine-trisha-to-act-in-new-movie-of-puneet-rajkumar/articleshow/84800585.cms

No comments