Breaking News

పూరి జగన్నాథ్‌కు అభిమానులు రిక్వెస్ట్.. ఆ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తే చూస్తారట..


డైరెక్టర్‌ రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన పూరి జగన్నాథ్‌ తరువాత తనదైన స్పెషల్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇతర దర్శకుల సినిమాల కంటే పూరి సినిమాలు కాస్త విభిన్నంగా ఉంటాయి. ఆయన సినిమాల్లో చూపించే హీరోయిజం వేరే లెవెల్‌లో ఉంటుంది. అందుకే పూరి సినిమాలకు ఇండస్ట్రీలో ఉండే క్రేజ్ వేరు. ఆయన సినిమా రిలీజ్ అయితే హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా చూస్తారు ఫ్యాన్స్. ప్రస్తుతం పూరి, విజయ్ దేవరకొండతో కలిసి ‘లైగర్’ అనే సినిమాలో తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ కిక్ బాక్సర్‌గా కనిపిస్తుండగా.. అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. దర్శకత్వంతో పాటు పూరి ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఓ సినిమాకు సంబంధించి పూరికి తెగ రిక్వెస్ట్‌లు వస్తున్నాయట. ఆ సినిమా మరేదో కాదు.. పూరి తనయుడు ఆకాష్ నటించిన ‘’. రెండేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా కరోనా కారణంగా కొంచెం ఆలస్యమైన.. ఎలాగోలా షూటింగ్ పూర్తి చేశారు. ఈ సినిమా ద్వారా కేతికా శర్మ హీరోయిన్‌గా పరిచయం అవుతుంది. అయితే ఇప్పటివరకూ ఈ సినిమా విడుదల విషయంలో ఇప్పటివరకూ క్లారిటీ లేదు. స్వయంగా నిర్మించిన ఈ సినిమా విడుదల విషయంలో ఎందుకు ఇంతా జాప్యం జరుగుతుందని సందేహాలు పుట్టుకొస్తున్నాయి. కనీసం ఓటీటీలో విడుదల చేసిన చూస్తామంటూ పూరిని అభిమానులు పెద్ద ఎత్తున కోరుతున్నారు. అయితే ఈ సినిమా విడుదల విషయంలో స్పష్టత విషయం పక్కనపెడితే ఆకాష్ మాత్రం మరో రెండు ప్రాజెక్టులు సైన్ చేశాడు. తాజాగా తన నెక్ట్స్ సినిమా ‘చోర్ బజార్’ ఫస్ట్‌లుక్ విడుదలైంది. దీంతో పాటు.. మరో సినిమాను కూడా అతను ట్రాక్‌లో పెట్టినట్లు తెలుస్తోంది.


By July 29, 2021 at 09:52AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/fans-ask-puri-jagannadh-to-release-romantic-movie-in-ott/articleshow/84848420.cms

No comments