Breaking News

కేరళను కలవరపెడుతున్న కరోనా.. మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్


దేశవ్యాప్తంగా తగ్గుముఖం పట్టినట్లే కనిపించిన కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. 30వేల దిగువకు వచ్చిన కేసులు రెండ్రోజులుగా మళ్లీ 40వేలకు పైగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా కేరళలో కరోనా తన ప్రతాపం చూపిస్తోంది. ఆ ఒక్క రాష్ట్రంలోనే 20వేల రోజువారీ కేసులు నమోదు కావడంతో ఆందోళన కలిగిస్తోంది. దీంతో అప్రమత్తమైన విజయన్ సర్కార్ కరోనా కట్టడికి మళ్లీ వైపు మొగ్గుచూపింది. జులై 31 నుంచి ఆంక్షలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్న కేంద్ర ప్రభుత్వం అక్కడి పరిస్థితులను పర్యవేక్షించేందుకు నేషనల్‌ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌కు చెందిన ఆరుగురు సభ్యుల బృందాన్ని కేంద్రం కేరళకు పంపనుంది. ‘కేరళలో భారీగా కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. వైరస్‌పై అక్కడి ప్రభుత్వం జరుపుతున్న పోరులో కేంద్ర బృందం సహకారం అందించనుంది’ అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. సెకండ్ వేవ్‌లో భాగంగా దేశాన్ని కుదిపేసిన కరోనా వైరస్ జూన్ నుంచి క్రమంగా అదుపులోకి వస్తోంది. అయితే చాలా రాష్ట్రాల్లో రోజువారీగా కరోనా కేసులు వందల సంఖ్యలో నమోదవుతుంటే కేరళలో మాత్రం నిత్యం 10వేలకు పైగా బయటపడుతున్నాయి. తాజాగా సంఖ్య 20వేల మార్కును దాటేసింది. దేశంలో నమోదయ్యే రోజువారీ కేసుల్లో సగం కేసులు ఒక్క కేరళలోనే నమోదు కావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం నివారణ చర్యలు తీసుకుంటోంది.


By July 29, 2021 at 11:57AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/complete-weekend-lockdown-in-kerala-state-unin-govt-sends-team-amid-rising-cases/articleshow/84850786.cms

No comments