పెళ్లి లేదు గిళ్లి లేదు.. అంతా పబ్లిసిటీ స్టంట్.. వనిత విజయ్ కుమార్ హల్చల్!
వ్యవహారం ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. గత ఏడాది అంతా కూడా మూడో పెళ్లి చుట్టు వివాదాలు నెలకొన్నాయి. చివరకు వనిత మూడో పెళ్లి పెటాకులైంది. పీటర్ పాల్‌తో జరిగిన వనిత పెళ్లి చివరకు వీగిపోయింది. తనకు విడాకులు ఇవ్వకుండానే వనితను పీటర్ పెళ్లి చేసుకున్నాడంటూ ఎలిజబెట్ పెట్టిన కేసుతో అసలు కథ మొదలైంది. వనిత పీటర్ పాల్ పెళ్లి కాంట్రవర్సీ సోషల్ మీడియాలో ఎంతటి చర్చకు దారి తీసిందో అందరికీ తెలిసిందే. అయితే చివరకు పీటర్ పాల్ వ్యవహార శైలి నచ్చక ఇంట్లోంచి గెంటేశారు వనిత. కానీ తానేమీ అలా చేయలేదని వనిత బుకాయించారు. తాగుడుకు బానిసయ్యాడు.. హాస్పిటల్‌లో ఆయన కోసం ఎంతో ఖర్చు పెట్టాను అని వనిత చెప్పుకొచ్చారు. అలా తన మూడో పెళ్లికి పుల్ స్టాప్ పెట్టేశారు వనిత. ఆ తరువాత వివాదాలకు దూరంగా ఉంటూ వస్తోన్న వనిత మళ్లీ ఈ మధ్య హాట్ టాపిక్ అవుతున్నారు. మొన్నటికి మొన్న సీనియర్ నటి రమ్యకృష్ణ మీద పరోక్షంగా ఆరోపణలు చేశారు. ఆమె ఎంతో హింసించిందని, దూషించిందని చెబుతూ బీబీ జోడిగల్ షో నుంచి వనిత తప్పుకున్నారు. అలా వనిత వేసిన వరుస ట్వీట్లు కాంట్రవర్సీకి దారి తీశాయి. ఇక మొన్నటికి మొన్న తమిళ పవర్ స్టార్ శ్రీనివాసన్‌ను పెళ్లి చేసుకున్నట్టుగా కొన్ని ఫోటోలను షేర్ చేశారు. అయితే నిజమైన పెళ్లి అనుకుని కొందరు వార్తలు కూడా రాసేశారు. అయితే అది పబ్లిసిటీ స్టంట్ అయి ఉంటుందని ఇంకొందరు కామెంట్లు చేశారు. మొత్తానికి ఆ ఫోటోలు పబ్లిసిటీ స్టంట్స్ అని తేలిపోయాయి. తన కొత్త సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే ఇలా చేశారని తేలిపోయింది. అనే సినిమాలో ఈ ఇద్దరూ జోడిగా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి వదిలిన పోస్టర్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
By July 24, 2021 at 11:30AM
No comments