ప్రకాష్ రాజ్ వెనుక పూరి జగన్నాథ్ హ్యాండ్.. 'మా' ఎన్నికల కోసం ఇద్దరూ కలిసి అలా! పక్కా ప్లాన్స్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలపై జనాల్లో ఓ రేంజ్ చర్చలు నడుస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉన్నా అప్పుడే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, విమర్శనాస్త్రాలు సంధించుకోవడం రాజకీయ వేడిని తలపిస్తున్నాయి. ఇప్పటికే తన ప్యానల్ మెంబెర్స్‌ని ప్రకటించి ముందడుగేసిన .. రాబోయే ఎన్నికల కోసం సరైన వ్యూహరచన చేసే పనిలో పడ్డారు. అయితే బ్యాక్ గ్రౌండ్‌లో ఆయనకు సపోర్ట్ అందుతోందని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. ప్రకాశ్ రాజ్ కేంద్రంగా జరుగుతున్న 'మా' ఎన్నికల రచ్చ రోజుకో మలుపు తిరుగుతోంది. లోకల్ నాన్ లోకల్ ఇష్యూ తెరపైకి రావడంతో ఫిలిం నగర్‌లో చర్చలు ముదిరాయి. ఈ విషయంలో కొందరు సినీ ప్రముఖులు ప్రకాశ్ రాజ్‌కు మద్దతు ప్రకటిస్తుండగా ఇంకొందరు మాత్రం విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ పరిస్థితుల నడుమ ప్రకాష్ రాజ్ వెనుక పూరి జగన్నాథ్ హ్యాండ్ కూడా ఉందనే వార్త బయటకు రావడం హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే ప్రకాష్ రాజ్‌కి మెగా ఫ్యామిలీ మద్దతు ఉందని తెలుస్తుండగా తాజాగా పూరి జగన్నాథ్ కూడా వెన్నంటి ఉన్నారనే వార్తలు బయటకొచ్చాయి. పూరి జగన్నాథ్- ప్రకాష్ రాజ్ మధ్య మంచి స్నేహబంధం ఉంది. 'బద్రి' సినిమా టైమ్ నుంచే వీళ్ళ మధ్య మంచి బాండింగ్ కొనసాగుతోంది. ఈ బాండింగ్ కారణంగానే పూరి సహాయం కోరారట ప్రకాష్ రాజ్. దీంతో ఆయన రిక్వెస్ట్ అగ్రీ చేసిన పూరి.. బ్యాక్ గ్రౌండ్‌లో కొన్ని కీలకమైన సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు సమాచారం. ఇద్దరూ కలిసి 'మా' ఎన్నికల కోసం వ్యూహరచన చేస్తూ అన్నీ పక్కాగా ప్లాన్ చేస్తున్నారని టాక్. మరోవైపు 'మా' ఎన్నికల పోటీలో మంచు విష్ణు ఉన్నారు. ఆయనకు నరేష్ సపోర్ట్ లభిస్తోందని తెలుస్తోంది. ఇక హేమ, సీవీల్ నరసింహా రావు తమ పోటీ కన్ఫర్మ్ చేయగా.. జీవిత రాజశేఖర్ ఎంట్రీ కన్ఫర్మ్ కావాల్సి ఉంది. ఏదేమైనా తాజా పరిస్థితులు చూస్తుంటే ఎప్పటికంటే ఈ సారి 'మా' వాడి వేడి పీక్స్‌లో ఉంటుందని తెలుస్తోంది కదూ!.
By July 04, 2021 at 10:17AM
No comments