దానికి ఇంకా టైం ఉంది.. పర్సనల్ విషయాలపై ప్రియమణి కామెంట్


ఇప్పుడు ప్యాన్ ఇండియాలో క్రేజ్ దక్కించుకుంది. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్‌లో సుచిత్ర పాత్రతో ప్రియమణి అందరినీ ఆకట్టుకుంది. ఇక రెండో సీజన్‌లోనూ ప్రియమణి అదే మ్యాజిక్‌ను చూపించారు. మొత్తానికి ప్రియమణి మాత్రం జాతీయ స్థాయిలో ఫేమస్ అయ్యారు. ఇద్దరు పిల్లల తల్లీగా నటించినా కూడా ప్రియమణి గ్లామరస్‌గానే కనిపించారు. ఇక ఇప్పుడు అంటూ డీ గ్లామర్ రోల్‌ను పోషిస్తున్నారు. నారప్ప చిత్రం జూలై 20న అమెజాన్ ప్రైమ్‌లో రాబోతోంది. ఈ మేరకు నారప్ప ప్రమోషన్స్‌లో భాగంగా ప్రియమణి ఎన్నో విషయాలను పంచుకున్నారు. అసురన్ సినిమాలో మంజు వారియర్ హీరోయిన్‌గా నటించింది. కానీ ఈ రీమేక్‌లో ఆ పాత్రను ప్రియమణి పోషిస్తోంది. దీనిపై ప్రియమణి స్పందిస్తూ.. రీమేక్ చేసేటప్పుడు పోలికలు పెడతారు. ఏమీ చేయలేం. అది సహజం. మంజు వారియర్ అద్భుతమైన నటి. అయితే నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశాను. ఎంత చేయాలో అంతా చేశాను. పేరు వస్తే హ్యాపీ అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో ప్రియమణి తల్లి పాత్రలు పోషిస్తున్నారు. మరి నిజ జీవితంలో తల్లిగా ఎప్పుడు మారుతారు? అని మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించింది. అది పర్సనల్ విషయం అని దాటేయకుండా.. నవ్వుతూ బదులిచ్చారు. ఇప్పుడు కాదండీ.. కొంచెం టైమ్ పడుతుందని అసలు సంగతిని ప్రియమణి బయటపెట్టేశారు. ముస్తఫా రాజ్‌ను ప్రియమణి 2017లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
By July 16, 2021 at 09:36AM
Post Comment
No comments