ఫిలిప్పీన్స్: కుప్పకూలిన యుద్ధ విమానం.. లోపల 85 మంది యువ సైనికులు
సైనికులతో వెళ్తున్న యుద్ధ విమానం కూలిపోయిన దుర్ఘఘటన ఫిలిప్పైన్స్‌లో ఆదివారం చోటుచేసుకుంది. ఈ విమానంలో 85 మంది జవాన్లు ఉన్నట్టు ఫిలిప్పైన్స్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రమాదం నుంచి ఇప్పటి వరరకూ 40 మంది సైనికులు సురక్షితంగా బయటపడినట్టు తెలిపింది. దక్షిణ ఫిలిప్పైన్స్‌లోని సులూ ప్రావిన్సుల్లోని జోలో విమానాశ్రయంలో ప్రమాదం జరిగినట్టు పేర్కొంది. సీ-130 యుద్ధ విమానం ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో కుప్పకూలిపోయిందని ఆర్మీ జనరల్ సిరిలిటో సొబేజనా తెలియజేశారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ప్రమాదంలో చిక్కుకున్నవారంతా ప్రాణాలతో బయటపడాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నామని సొబేజనా అన్నారు. విమానంలో ఉన్నవారంతా ఇటీవల సైనిక శిక్షణ పూర్తిచేసుకున్నవారే కావడం బాధాకారం. ముస్లిం ప్రాబల్యం ఎక్కువుగా ఉండే రెసిటివ్ ద్వీపంలో ఉగ్రవాదంపై పోరాటానికి ఉమ్మడి టాస్క్‌ఫోర్స్‌లో భాగంగా వీరిని ఆ ప్రాంతానికి తరలిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. విమానం కూలిపోయిన వెంటనే భారీగా మంటలంటుకున్నాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సైన్యం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాద సమయానికి విమానంలో మొత్తం 92 మంది ఉన్నట్టు అంతర్గత నివేదిక ద్వారా తెలిసిందని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి డెల్ఫిన్ లోరెంజిన్ అన్నారు. వీరిలో 85 మంది సైనికులు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు క్యాబిన్ క్రూ సిబ్బంది ఉన్నారని తెలిపారు. దక్షిణ ఫిలిప్పిన్స్‌లో అతివాద సంస్థ అబూ సయాఫ్ సహా ఉగ్రవాద గ్రూప్‌ల కార్యకలాపాలు సాగిస్తుండటంతో ఈ ప్రాంతంలో సైన్యాన్ని భారీగా మోహరిస్తారు.
By July 04, 2021 at 11:48AM
No comments