Breaking News

మా అత్తకు బాయ్ ఫ్రెండ్ కావాలి.. రెండు రోజులకు రూ.75 వేలు: కోడలు ప్రకటన వైరల్!


సాధారణంగా వరుడు లేదా వధువు కావలెను అని వెబ్‌సైట్లు, పత్రికల్లో ప్రకటన ఇస్తుంటారు. అలాగే, తల్లి లేదా తండ్రికి అప్పడప్పుడు పిల్లలు, కొడలికి అత్తమామలు వివాహాలు జరిపించిన సందర్భాలున్నాయి. అయితే ఇందుకు భిన్నంగా ఓ కోడలు తన అత్తకు బాయ్ ఫ్రెండ్‌ను వెతికపెట్టాలని నిర్ణయించింది. ఆ ఆలోచన వచ్చేందు తడువుగా ఇందుకోసం ఓ ప్రకటన కూడా ఇచ్చింది. అంతేకాదు, అతడికి వెయ్యి డాలర్లు చెల్లిస్తామని హామీ ఇచ్చిది. ఈ విచిత్రమైన సంఘటన అమెరికాలోని న్యూయార్క్ నగరంలో చోటుచేసుకుంది. న్యూయార్క్‌లోని హుడ్సన్ వ్యాలీలో నివసించే మహిళ ఇచ్చిన ఈ ప్రకటన ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘అత్తగారికి వెడ్డింగ్ డేట్ కోసం వ్యక్తి కావాలి’ అంటూ కోడలు ప్రకటన ఇచ్చింది. తన 51 ఏళ్ల అత్తయ్యతో కాస్త సమయం గడిపి, తమతో పాటు ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు 40-60 ఏళ్ల మధ్య వయస్సున్న అందమైన వ్యక్తులు అద్దెకు కావాలంటూ క్రెయిగ్స్లిస్ట్ అనే క్లాసిఫైడ్స్ వెబ్సైట్‌లో ప్రకటన ఇచ్చింది. అందుకోసం రెండు రోజులకు 1,000 డాలర్లు (సుమారు 75,000) ఇస్తానని తెలిపింది. బాయ్‌ ఫ్రెండ్‌గా వచ్చే వ్యక్తి అందగాడు.. వాక్చాతుర్యంతో పాటు బాగా డాన్స్ కూడా వచ్చి ఉండాలని షరతు విధించింది. పెద్దల పట్ల గౌరవం ఉండాలి.. ఆమెపై అపరామైన శ్రద్ధ చూపాలి.. సూట్ ధరించాలి అని షరతుల్లో పేర్కొంది. అయితే, తాము కల్పించే సౌకర్యాల గురించి కూడా ప్రకటనలో తెలిపింది. మాట్లాడాల్సిన అంశాలు, దానికి సంబంధించి సమాచారం, బసచేయడానికి హోటల్, ఫుడ్, ప్రయాణ ఖర్చులను భరిస్తామని తెలిపింది. ఈ ప్రకటన పట్ల ఆసక్తి ఉన్నవారు తమ ఫోటోను పంపాలని సూచించింది. ఒకవేళ మా ఆఫర్ నచ్చి ముందుకొచ్చిన వ్యక్తి గురించి తెలుసుకున్న తర్వాతే సమ్మతి తెలియజేస్తామని పేర్కొంది. ఇది కేవలం భద్రత కోసమేనని వివరించింది. అయాచిత సేవలలు కోరుకునేవారు మాత్రం నన్ను సంప్రదించవద్దు అని ప్రకటన చివరిలో చిన్న అక్షరాలతో ముద్రించారు. ప్రస్తుతం ఆ ప్రకటన నెట్టింట్లో వైరల్‌ అవుతుండగా.. నెటిజన్లు విభిన్న రీతుల్లో స్పందిస్తున్నారు.


By July 21, 2021 at 10:38AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/daughter-in-law-puts-advertisement-for-hire-a-boy-friend-to-her-mother-in-law/articleshow/84606419.cms

No comments