యూపీ: 21 ఏళ్ల ప్రియుడితో నాలుగో పెళ్లికి సిద్ధమైన 45 ఏళ్ల మహిళ.. చివరిలో ట్విస్ట్
పెళ్లయి ఐదుగురు కుమార్తెలున్న ఓ 45 ఏళ్ల మహిళ.. 21 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. అతడిపై మోజుతో తన ఐదుగురు కుమార్తెలను ఇంటిలో నుంచి గెంటేసిన ఆ మహిళ.. ప్రియుడితో నాలుగో పెళ్లికి సిద్ధమయ్యింది. తల్లి వ్యవహారశైలి నచ్చని ఆమె కుమార్తెలు ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దర్నీ స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. యువకుడికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో అతడు పెళ్లికి నిరాకరించారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని భిండ్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఝాన్సీ మొహల్లా గ్రామానికి చెందిన మహిళ (45)కు అదే ఊరికి చెందిన మిథున్ (21) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఇష్టంగా మారడంతో ఇరువురూ చాలాకాలం పాటు సహజీవనం కూడా చేశారు. అప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న ప్రియురాలికి.. ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. ఇంట్లో ఎదిగిన ఆడపిల్లలుండగా ఇటువంటి పనులేంటని తల్లిని కుమార్తెలు నిలదీశారు. తల్లి వ్యవహారాన్ని ఆమె కుమార్తెలు మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు. యువకుడి మత్తులో ఉన్న ఆమెకు వారుచెప్పింది చెవికెక్కలేదు. తొలుత తన నిర్వాకాన్ని ఎదురించిన రెండో కుమార్తెను ఏడాది కిందటే ఇంట్లో నుంచి తరిమేసింది. ప్రస్తుతం ఆ యువకుడితో వివాహానికి సిద్ధం కావడంతో మిగతా నలుగురు కుమార్తెలు అడ్డుచెప్పారు. దీంతో వారిని కూడా బయటకు గెంటేసింది. తల్లి వ్యవహారశైలి నచ్చని ఆమె కుమార్తెలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘోరాన్ని ఆపాలని పోలీసులను కోరారు. దీంతో సదరు మహిళ, ఆమె ప్రియుడ్ని పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. యువకుడు మిథున్‌కు కౌన్సెలింగ్ ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన కౌన్సెలింగ్‌తో ప్రియుడు ఆమెతో పెళ్లికి నిరాకరించాడు.
By July 12, 2021 at 07:29AM
No comments