Breaking News

18ఏళ్లకే డేటింగ్.. భర్తను చంపి ప్రియుడితో ఎస్కేప్.. పదేళ్ల తర్వాత పండిన పాపం


బాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్‌లో ఉండగా తన ఇష్టానికి వ్యతిరేకంగా తల్లిదండ్రులు మరో వ్యక్తితో పెళ్లి చేయడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్తను కిరాతకంగా చంపేసింది. 2011లో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ కేసును క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎట్టకేలకు చేధించారు. ఢిల్లీకి చెందిన శకుంతల(28)‌.. టీనేజ్ వయస్సులో నుంచే కమల్‌ సింగ్లా అనే వ్యాపారవేత్తతో డేటింగ్‌లో ఉంది. అదే సమయంలో 2011లో రవికుమార్‌ అనే వ్యక్తికిచ్చి ఆమెకు తల్లిదండ్రులు వివాహం జరిపించారు. ఇష్టంలేని పెళ్లి చేసుకున్న శకుంతల భర్తతో కాపురం చేయడానికి చాలా ఇబ్బంది పడేది. భర్త కళ్లుగప్పి అప్పుడప్పుడు ప్రియుడితో రాసలీలలు కొనసాగించేది. భార్య వ్యవహారం గురించి తెలుసుకున్న రవికుమార్ ఆమెను ఫోన్లో ఎవరితోనూ మాట్లాడకనివ్వకుండా అడ్డుకునేవాడు. బయటికి కూడా పంపించకుండా ఇంట్లోనే నిర్భంధించేవాడు. దీంతో తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్న భర్తను అడ్డు తొలగించుకోవాలని శకుంతల నిర్ణయించుకుంది. ప్రియుడితో కలిసి భర్త మాస్టర్ ప్లాన్ వేసింది. హత్య చేసిన తర్వాత పోలీసులకు దొరికిపోతామని ముందుగానే గ్రహించిన శకుంతల-కమల్ జాగ్రత్త పడ్డారు. అందుకే రవికుమార్‌ను చంపేసిన తర్వాత శవాన్ని నుంచి కమల్ వ్యాపారం చేస్తున్న అల్వార్‌()కు తరలించారు. అక్కడే ఓ ప్రాంతంలో గుట్టుగా సమాధి చేశారు. మళ్లీ కొద్దిరోజుల తర్వాత శవాన్ని వెలికి తీసి హర్యానా-రెవారి రహదారిపై పడేశారు. ఆ తర్వాత ఎవరికీ దొరకమన్న ధీమాతో రాజస్థాన్‌లోనే సెటిల్ అయ్యారు. అయితే మృతదేహాలు ముక్కలు ముక్కలుగా దొరికిన వ్యవహారం అప్పట్లో రాజస్థాన్‌లో హాట్ టాపిక్‌ అయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు పురోగతి సాధించలేక కేసును క్రైమ్‌ బ్రాంచ్‌కు అప్పగించారు. కేసును హ్యాండ్‌ ఓవర్ చేసుకున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. రవికుమార్ హత్య అనంతరం ఆరేళ్ల పాటు సహజీవనం చేసిన శకుంతల-కమల్ 2017లో వివాహం చేసుకున్నట్టు గుర్తించారు. ప్రియుడితో కలిసి ఉండేందుకు శకుంతలే అతడిని హత్య చేసిందని ఆధారాలతో సహా తేల్చారు. ఇదే క్రమంలో 2018లో రాజస్థాన్‌లో ఈ జంట నివాసం ఉంటున్నారని తెలుసుకొని కమల్‌ను అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న శకుంతల అక్కడి నుంచి పరారైంది. ఈ కేసును మరింత సీరియస్‌గా తీసుకున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెపై రూ.50వేల రివార్డు ప్రకటించారు. చివరకు అల్వార్‌లోనే ఆమె ఆచూకీ తెలుసుకున్న పోలీసులు మంగళవారం శంకుతలను అరెస్ట్ చేశారు. దీంతో రవికుమార్‌ హత్య కేసును పదేళ్ల తర్వాత పోలీసులు చేధించినట్లయింది.


By July 21, 2021 at 11:24AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/delhi-woman-kills-her-husband-to-marry-boyfriend-arrested-after-10-year-hunt/articleshow/84607287.cms

No comments