Breaking News

బుల్డోజర్‌తో తొక్కించి రూ.163 కోట్ల విలువైన డ్రగ్స్ ధ్వంసం చేసిన సీఎం


దల కోట్ల విలువైన మాదకద్రవ్యాలను అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేతుల మీదుగా ధ్వంసం చేశారు. గత మూడు నెలలుగా అసోం పోలీసులు రూ.163.58 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటిని శని, ఆదివారాల్లో థింపు, గోలఘాట్, బర్హంపూర్, హజోయి, నాగాన్‌ ప్రాంతాల్లో ధ్వంసం చేయగా... సీఎం హిమంత పాల్గొన్నారు. ఆదివారం నాగాన్‌లో నిర్వహించిన డ్రగ్స్ డిస్పోజల్ కార్యక్రమంలో సీఎం శర్మ స్వయంగా బుల్డోజర్‌ నడిపి... అక్రమ డ్రగ్‌ డీలర్స్‌పై కఠినంగా వ్యవహరిస్తామన్న సందేశాన్ని పంపారు. అసోం యువకులు నిషేధిత మాదకద్రవ్యాలకు బలైపోతున్నారని, డ్రగ్స్ కోసం అసొంను రవాణా మార్గంగా ఉపయోగించడాన్ని తాము ఏ మాత్రం సహించోమని సీఎం ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. https://twitter.com/ANI/status/1416699126499069960 అసోం నుంచి భారత్‌లోకి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని.. రవాణాను, ఉత్పత్తిని ఆపడం తన జాతీయ బాధ్యతని సీఎం స్పష్టం చేశారు. అక్రమంగా డ్రగ్స్‌ తరలించేవారి పట్ల కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మే 10 నుంచి జూలై 15 మధ్యకాలంలో అసోం పోలీసులు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టం ప్రకారం 874 కేసులను నమోదు చేశారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,493 మంది మాదకద్రవ్యాల డీలర్లను అరెస్టు చేసి, దాదాపు రూ. 163 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారని హిమంత బిశ్వ శర్మ వివరించారు. ‘పొరుగు దేశాల నుంచి భారత భూభాగంలోకి మాదక ద్రవ్యాల రవాణా మార్గంగా మాత్రమే అసోం ఉందనుకున్నాం. కానీ తాజా పరిస్థితులు చూస్తే రాష్ట్రంలోని వేలాది మంది యవత ఈ మత్తు పదార్థాలకు బానిసలైనట్టు గుర్తించాం’ అని తెలిపారు. డ్రగ్స్‌ నియంత్రణలో భాగంగా.. వాటిని అక్రమంగా తరలిస్తూ పోలీసులను చూసి పారిపోయే వారిపై కాల్పులు జరిపిన ఉదంతాలు కూడా చాలా ఉన్నాయని, అందుకు పోలీసులు విమర్శలనూ ఎదుర్కొన్నారన్నారు. కానీ మాదకద్రవ్యాల రవాణాను అరికట్టేందుకు ఓ ముఖ్యమంత్రిగా నేను వారికి పూర్తి అధికారాలు ఇచ్చానని తెలిపారు. ధ్వంసం కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను సీఎం ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.


By July 19, 2021 at 10:36AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/assam-chief-minister-himanta-biswa-sarma-drives-bulldozer-over-seized-drugs/articleshow/84542431.cms

No comments