Breaking News

త్రిపురలో డెల్టా ప్లస్ కలకలం.. 152 శాంపిల్స్‌లో 90 శాతం పాజిటివ్!


కారణంగా భారత్‌పై కరోనా సెకండ్ వేవ్ పంజా విసిరిన సంగతి తెలిసిందే. ఈ వేరియంట్ జన్యుమార్పిడితో డెల్టా ప్లస్‌గా రూపాంతరం చెందింది. ఇది ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ కొత్త వేరియంట్ కారణంగా భారత్‌లో థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఏపీల్లో కేసులను ఇది వరకే గుర్తించారు. కాగా ఈశాన్య రాష్ట్రమైన కేసులు ఇటీవల ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. త్రిపుర నుంచి 151 శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పశ్చిమ బెంగాల్‌కు పంపగా.. అందులో 138 శాంపిళ్లలో డెల్టా ప్లస్ వేరియంట్ ఉందని తేలిందని త్రిపుర కోవిడ్ నోడల్ ఆఫీసర్ దీప్ దేవ్ వర్మ వెల్లడించారు. ఇప్పటి వరకూ దేశంలో 161 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులను గుర్తించినట్లు వర్మ తెలిపారు. త్రిపుర శాంపిళ్లలో డెల్టా ప్లస్ వేరియంట్‌తోపాటు 10 డెల్టా, 3 ఆల్ఫా వేరియంట్లు సైతం ఉన్నట్లు తేలింది. ఒక్క పశ్చిమ జిల్లాలోనే 115 శాంపిళ్లలో డెల్టా ప్లస్ వేరియంట్‌ను గుర్తించాం. సెపహిజలా జిల్లాలో 8, గోమతి జిల్లాలో 5, ఉనకోటి జిల్లాలో 4, ఉత్తర, దక్షిణ జిల్లాల్లో రెండేసి శాంపిళ్లలో డెల్టా ప్లస్ వేరియంట్‌ను గుర్తించినట్లు త్రిపుర కోవిడ్ నోడల్ ఆఫీసర్ తెలిపారు. త్రిపురలో శుక్రవారం నాటికి 56 వేల 169 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలో 574 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోగా.. 5 వేలకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రంలో డైలీ పాజిటివిటీ రేటు 5 శాతంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో రాష్ట్రంలోని 50 నుంచి 60 శాతం మంది కరోనా పేషెంట్లు డెల్టా వేరియంట్ బారిన పడ్డారని త్రిపుర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అయితే, కేంద్రం మాత్రం త్రిపుర చెబుతున్నట్టు డెల్టా ప్లస్ కేసులు 90 శాతం కావని, ఇందులో డెల్టా వేరియంట్ ఉందని ప్రకటించడంతో గందరగోళం నెలకొంది. తాజాగా భారీ సంఖ్యలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు వెలుగు చూడటంతో త్రిపుర అధికారులు అప్రమత్తం అయ్యారు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం కోసం ఆ రాష్ట్రంలో వీకెండ్ కర్ఫ్యూను తిరిగి అమలు చేస్తున్నారు. ఇప్పటికే రాజధాని అగర్తలాతోపాటు పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కాగా వ్యాక్సినేషన్ ప్రక్రియలో త్రిపుర ముందంజలో ఉంది. జూలై ఆరంభం నాటికే ఆ రాష్ట్రంలో చాలా మంది టీకాలు వేయించుకున్నారు. 45 ఏళ్లు పైబడిన వారిలో 98 శాతం, 18 ఏళ్లు దాటిన వారిలో 80 శాతం త్రిపుర వాసులు కనీసం ఒక డోసు టీకా వేయించుకున్నారు. దేశంలో ఎక్కువ శాతం మందికి వ్యాక్సిన్లు వేయించిన రాష్ట్రాల జాబితాలో త్రిపుర ముందువరసలో ఉంది.


By July 11, 2021 at 08:21AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/tripura-says-delta-plus-in-90-genome-sequencing-samples-centre-disagrees/articleshow/84309866.cms

No comments