Breaking News

మిట్టమధ్యాహ్నం ఇంట్లోకి చొరబడి యువతిపై గ్యాంగ్ రేప్.. రూ.15 లక్షలు దోపిడీ!


అపార్ట్‌మెంట్‌లోకి చొరబడిన దుండుగులు.. ఒంటిరిగా ఉన్న మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన అనంతరం ఆ ఇంట్లో ఉన్న రూ.15 లక్షలు నగదు ఎత్తుకెళ్లారు. ఈ దారుణ ఘటన పశ్చిమ్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో చోటుచేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. పోలీసుల కథనం ప్రకారం.. గార్డెన్‌ రీచ్‌ ప్రాంతంలోని ఓ అపార్టుమెంట్‌లోకి చొరబడిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు 26 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె ఇంట్లో ఉన్న రూ.15లక్షల నగదు దోచుకెళ్లారని వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం బాధితురాలు ఒంటరిగా ఉన్న సమయంలో ఈ దారుణం చోటుచేసుకున్నట్టు తెలిపారు. యువతి తల్లిదండ్రులు గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పనికోసం వెళుతూ బయట నుంచి లాక్ చేసుకుని వెళ్లిపోయారని ఫిర్యాదులో పేర్కొంది. ఇద్దరు ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు లాక్ పగలగొట్టి తలుపు తెరిచి లోపలికి ప్రవేశించిన తర్వాత బెడ్ రూమ్‌లో బంధించారు. అత్యాచారం చేసిన తర్వాత పక్కనే ఉన్న బీరువాను పగలుగొట్టి రూ.15 లక్షల నగదు, బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. వైద్య పరీక్షల్లో బాధితురాలిపై అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ అయిందని సీనియర్‌ పోలీస్‌ అధికారి వెల్లడించారు. ఇది ఆమెకు తెలిసిన వారి పనే అయి ఉంటుందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. అత్యాచారం అనంతరం ఇంట్లోని రూ.15లక్షల నగదు ఎత్తుకెళ్లినట్టు గార్డెన్‌ రీచ్‌ పోలీస్‌ స్టేషన్‌లో మహిళ బుధవారం ఫిర్యాదు చేశారని కోల్‌కతా పోలీస్‌ డిటెక్టివ్‌ విభాగం అధికారులు వివరించారు. అత్యాచారానికి ముందు మహిళను బంధించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ఘటనా స్థలం నుంచి ఫోరెన్సిక్‌ బృందం శాంపిల్స్‌ను సేకరించిందని, అలాగే, ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించినట్టు చెప్పారు. ఇప్పటి వరకూ ఎవర్నీ అరెస్ట్ చేయలేదని, నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు వివరించారు.


By July 08, 2021 at 08:29AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-gang-raped-in-her-flat-robbed-of-15-lakh-cash-in-kolkata/articleshow/84224041.cms

No comments