Breaking News

స్టూడెంట్ క్రెడిట్ కార్డు.. రూ.10 లక్షల వరకూ రుణం: వినూత్న పథకానికి శ్రీకారం


పథకాన్ని ముఖ్యమంత్రి బుధవారం ప్రారంభించారు. ఈ పథకం కింద ఎటువంటి ష్యూరిటీ లేకుండా విద్యార్థులు రూ.10 లక్షల వరకూ రుణం పొందవచ్చని ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటరీగా ఉంటుందని, ప్రపంచంలోనే ఇది మొదటి పథకమని అన్నారు. ‘తాము కన్న కలలను నిజం చేసుకోడానికి పదో తరగతి విద్యార్థుల నుంచి ఈ పథకం వర్తిస్తుంది’ అని మమతా బెనర్జీ వెల్లడించారు. రూ.10 లక్షల వరకు రుణం తీసుకుని, 15 ఏళ్లలోపు చెల్లించవచ్చు. ‘గ్రాడ్యుయేషన్, పీజీ, డిప్లొమా, మెడిసిన్, రిసెర్చ్‌ల కోసం విద్యార్థులు రుణాలను తీసుకోవచ్చు. ఐఏఎస్, ఐపీఎస్, పశ్చిమ్ బెంగాల్ సివిల్ సర్వీసెస్ సహా ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి, కోచింగ్ కోసం కూడా విద్యార్థులు రుణం పొందవచ్చు’ అని తెలిపారు. క్రెడిట్ కార్డు ద్వారా ట్యూషన్ ఫీజులు, హాస్టల్ ఫీజులు, పుస్తకాలు, కంప్యూటర్, ల్యాప్‌టాప్ సహ అకడమిక్ సంబంధిత అంశాలకు ఖర్చు చేయవచ్చని తఅన్నారు. అంతేకాదు, విద్యా సంస్థల్లో ప్రవేశానికి కూడా దీనిని వినియోగించవచ్చన్నారు. ‘కార్డు ప్రత్యేకత ఏమిటంటే.. 40 సంవత్సరాల వయస్సు వరకు దీనికి అర్హులు.. “మేము వయోపరిమితిని 40 కి పెంచడానికి కారణం ఉంది.. ఎందుకంటే నిధుల కొరత కారణంగా చదువును వదులుకున్నట్టు విద్యార్థులను మనం తరచుగా చూస్తున్నాం... కానీ వారు ఇప్పటికీ విద్యపై ఆసక్తి కలిగి ఉండవచ్చు లేదా ఒకరకమైన పరిశోధన చేయాలనుకోవచ్చు లేదా పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు.. అటువంటి వారి కోసం మేము 40 ఏళ్ల వయస్సు వరకు కార్డును ఉపయోగించడానికి అనుమతించాం’ అని అన్నారు. ‘ఈ కార్డు ద్వారా అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ బ్యాంకుల్లో రుణం తీసుకోవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువు, భవిష్యత్తు గురించి ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. యువత ఇకపై విద్యా రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. విద్యార్థి క్రెడిట్ కార్డు చాలా మంది కలలను సాకారానికి సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను’ అని ముఖ్యమంత్రి అన్నారు. అయితే, కార్డుతో మోసాలు జరిగే అవకాశాలపై కూడా ఆమె హెచ్చరించారు. ఏదైనా మోసానికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ కార్డు కోసం రాష్ట్ర విద్యా మండలి వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


By July 01, 2021 at 08:33AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/west-bengal-cm-mamata-banerjee-launches-student-credit-card-with-rs-10-lakh-loan-facility/articleshow/84008329.cms

No comments