Breaking News

ShameonYouSamantha.. ఏకిపారేస్తున్న నెటిజన్లు.. అసలు కారణమిదే


దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంతకు ట్రోలింగ్ కొత్తేమీ కాదు. వివాదాలతో ఆటలు ఆడుకున్న రోజులు కూడా ఉన్నాయి. సమంత రివర్స్ కౌంటర్ ఇస్తే అందరూ షాక్ తిన్న రోజులున్నాయి. తనపై ట్రోల్ చేసే వారికి అసభ్య సంజ్ఞలతో సమంత ఘాటుగా రిప్లై ఇస్తుంటారు. తన వస్త్రధారణ మీద ఆ మధ్య నెగెటివ్ కామెంట్లు రావడంతో సమంత ఇచ్చిన రిప్లై ఎంతటి వివాదానికి దారి తీసిందో అందరికీ తెలిసిందే. మహేష్ బాబు సినిమా పోస్టర్ మీద సమంత చేసిన కామెంట్లు ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే. అలా సమంతకు ట్రోలింగ్, కాంట్రవర్సీలు కొత్తేమీ కాదు. ఇక సిద్దార్త్‌తో ప్రేమ, బ్రేకప్ ఇలాంటి విషయంలో నాడు ఎదురైన ట్రోలింగ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య సమంత చుట్టూ ఓ కాంట్రవర్సీ తిరుగుతోంది. తమిళ నటి అయి కూడా తమిళులకు వ్యతిరేకంగా కనిపించే పాత్రలో నటించడంతో అక్కడి వారు భగ్గుమంటున్నారు. ఎల్టీటీఈ, తమిళ ప్రజలకు వ్యతిరేకంగా తీశారంటూ ఫ్యామిలీమెన్ సీజన్ 2 సినిమాపై తమిళ నాడు ఆగ్రహం వ్యక్తం చేసింది. టెర్రరిస్ట్ పాత్రను సమంత పోషించడంతో మరింత రచ్చగా మారింది. ఫ్యామిలీమెన్ సీజన్2ను నిషేధించాలంటూ తమిళనాడు ప్రభుత్వం కేంద్రాన్ని కూడా కోరింది. సమంత వెంటనే క్షమాపణలు చెప్పాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా సమంత మోస్ట్ డిజరైబుల్ వుమెన్ 2020లో టాప్ ప్లేస్‌ను సాధించారు. ఈ సందర్భంగా సమంత అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో తమిళ సినీ ప్రేమికులు మాత్రం సమంతను దారుణంగా ఏకిపారేస్తున్నారు. ShameonYouSamantha అనే హ్యాష్ ట్యాగ్‌ను దేశ వ్యాప్తంగా ట్రెండ్ చేస్తున్నారు. సమంత వెంటనే క్షమాపణలు చెప్పాలి, ఫ్యామిలీమెన్ సీజన్ 2ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


By June 02, 2021 at 07:04PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/samantha-gets-trolled-for-family-man-2-on-most-desirable-women-2020/articleshow/83175271.cms

No comments