Breaking News

PSPK28 : వాటిని నమ్మకండి.. అభిమానులను నిరాశ పర్చిన డైరెక్టర్


పవర్ స్టార్ సినిమాలకు సంబంధించిన అప్డేట్లు అంటే సోషల్ మీడియా మొత్తం ఎలా ఊగిపోతోందో అందరికీ తెలిసిందే. గత కొన్ని రోజులుగా అభిమానులు అప్డేట్ కోసం ఒకటే హడావిడి చేయడం మొదలుపెట్టేశారు. గురించి ఏదో ఒకటి ట్రెండ్ చేయడం మొదలుపెట్టేశారు. అలా PSPK28ను నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తూ మేకర్స్ మీద ఒత్తిడి తెచ్చేవారు. త్వరలోనే అప్డేట్ వస్తుంది.. ఇస్తారని చెబుతూ నెటిజన్లు ట్వీట్ల వర్షాన్ని కురిపించేవారు. ఈ క్రమంలో హెయిర్ స్టైలీస్ట్ రామ్ మాట్లాడిన మాటలు నెట్టింట్లో పూనకాలు తెప్పించాయి. PSPK28 అంటూ ట్రెండ్ చేస్తూ గతంలో కొందరు మాట్లాడిన మాటలు, చేసిన కామెంట్లను షేర్ చేశారు. అందులో హెయిర్ స్టైలిష్ట్ రామ్ PSPK28 గురించి మాట్లాడిన మాటలు, ఇచ్చిన హైప్ అందరినీ ఆకట్టుకుంది. ఫస్ట్ లుక్ అదిరిపోతుంది, వకీల్ సాబ్ కంటే పది రెట్లు ఉంటుందని, ఫ్యాన్స్ కడుపు నిండుతుందని, పవన్ కళ్యాణ్ కలిసి ఆ లుక్ డిజైన్ చేసుకున్నారని చెప్పుకొచ్చారు. త్వరలోనే ఫస్ట్ లుక్ రాబోతోందంటూ కూడా హింట్ ఇచ్చాడు. ‘ఈ మేరకు PSPK28 టీం నిన్న ఓ ప్రెస్ నోట్‌ను విడుదల చేశారు. మేం ఉగాదికి ఫస్ట్ లుక్ అండ్ టైటిల్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేశాం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వాయిదా వేశాం. అయితే మా సినిమా గురించి సోషల్ మీడియాలో నడుస్తోన్న చర్చ ఎంతో బాగుంది. అయితే మేం అధికారికంగా ప్రకటించే వరకు దేన్నీ నమ్మకండి. సరైన టైంలో అన్నింటిని అధికారికంగా ప్రకటిస్తామ’ని మైత్రీ మూవీస్ పేర్కొంది. ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ నెట్టింట్లో హల్చల్ చేయడంతో దెబ్బకు మైత్రీ మూవీస్ దిగి వచ్చినట్టు తెలుస్తోంది. ఆ ఫ్యాన్ మేడ్ పోస్టర్ అదిరిపోవడంతో అందరూ షేర్ చేయసాగారు. దీంతో ఇలా నిర్మాణ సంస్థ దిగి రాక తప్పలేదు. అయితే PSPK28 అప్డేట్ ఎప్పుడు వస్తుందో అని అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు. అలాంటి వారి ఆశలపై డైరెక్టర్ హరీష్ శంకర్ నీళ్లు చల్లినట్టు అయింది. బయట వచ్చే రూమర్లను నమ్మకండి.. నిజమైన టైటిల్ వచ్చినప్పుడు మీకు ఎంతో నచ్చుతుంది. మీకంటే నేనే ఎంతో ఎగ్జైట్‌గా ఉన్నాను అని హరీష్ శంకర్ అన్నారు.


By June 09, 2021 at 07:17AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mythri-movie-makers-about-pspk28-first-look-and-title/articleshow/83357978.cms

No comments