Nandigram Election సువేందు గెలుపుపై హైకోర్టుకు దీదీ.. రేపే కీలక విచారణ
నందిగ్రామ్ నియోజకవర్గంలో బీజేపీ నేత గెలుపును సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి బరిలో నిలిచిన దీదీ.. 2000 ఓ ట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. లంచం, ద్వేషం, శత్రుత్వాన్ని పెంపొందించడం, మతం, బూత్‌ల ఆధారంగా ఓట్లు కోరడం; ఓట్ల లెక్కింపు ప్రక్రియ, ఫారమ్ 17 సిలో అవకతవకలు; నమోదయిన ఓట్ల సంఖ్య.. ఫలితాల్లో అక్రమాలకు పాల్పడినట్టు దీదీ ఆరోపించారు. అంతేకాదు, రీకౌంటింగ్ చేపట్లాలన్న తన అభ్యర్థనను ఎన్నికల కమిషన్ తోసిపుచ్చడాన్ని కూడా మమతా ప్రశ్నించారు. ‘‘సువేందు అధికారి అనేక అవినీతి, అక్రమాలకుకు పాల్పడ్డారు.. అది తన గెలుపు అవకాశాలను మెరుగుపరిచింది.. మమతా బెనర్జీ ఎన్నికలలో విజయం సాధించే అవకాశాలను భౌతికంగా మార్చింది’’అని తన పిటిషన్‌లో సీఎం పేర్కొన్నారు. నందిగ్రామ్ ఎన్నికను కొట్టేయాలని మమతా బెనర్జీ తరఫున న్యాయవాది సంజయ్ బోస్ కోరారు. మూడు రోజుల కిందటే ఈ పిటిషన్ దాఖలు కాగా.. శనివారం విచారణకు రానుంది. జస్టిస్ కౌసిక్ చందా ధర్మాసనం రేపటి విచారణల జాబితాలో ఇదే మొదటి అంశం. ఈ అంశంపై విచారణ జస్టిస్ చందా ధర్మాసనానికి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి కేటాయించారు. సీఎం పిటిషన్‌పై ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా స్పందించింది. ‘‘ఎన్నికల్లో మీరు రెండుసార్లు ఎలా ఓడిపోతారు? ప్రజల తీర్పును కోర్టులో సవాల్ చేయడం.. నందిగ్రామ్‌లో ఓటమికి మమతా బెనర్జీ రెండుసార్లు అవమానంగా చూడటం విడ్డూరంగా ఉంటుంది’’ అని బీజేపీ నేత అమిత్ మాలవీయ విమర్శించారు. మే 2న నందిగ్రామ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైన తర్వాత మమతా బెనర్జీ, సువేందు మధ్య హోరాహోరీ పోరు సాగింది. కొన్ని రౌండ్లు సువేందు ఆధిక్యం చూపితే.. కొన్నిసార్లు మమతా లీడ్‌లో వచ్చారు. పదకొండు రౌండ్ల వరకు సువేందు ఆధిక్యంలో సాగినా.. ఆ తర్వాత మమతా ముందంజలోకి వచ్చారు. చివరి రౌండ్ వరకూ ఉత్కంఠ కొనసాగింది. నాటకీయ పరిణామాల మధ్య సువేందు గెలిచినట్టు ఈసీ ప్రకటించింది. అయితే, దీనికి ముందే దాదాపు 1,400 ఓట్లతో మమతా బెనర్జీ గెలిచినట్టు జాతీయ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ, గంటలోనే ఫలితం తారుమారైందని మమతా బెనర్జీ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్‌ను బెదిరించారని, ఆయనకు సంబంధించిన ఓ ఫోన్ కాల్ వాయిస్ రికార్డర్‌ను దీదీ బయటపెట్టారు. గవర్నర్ కూడా తనకు శుభాకాంక్షలు చెప్పారని, అంతలోనే పరిస్థితి మారిపోయిందని దీదీ అన్నారు.
By June 18, 2021 at 08:17AM
No comments