Breaking News

Nandamuri Balakrishna Birthday: పదేళ్ల ఆకలిని తీర్చిన నందమూరి సింహం.. బాలయ్య బాబు సత్తా ఇదే!


Nandamuri Balakrishna: తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు . సినిమాల్లోని తన నటనతో ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. నందమూరి నటసింహంగా అభిమానులు కీర్తిస్తుంటారు. బాలయ్య బాబు అంటూ అభిమానులు ప్రేమగా పిలుచుకుంటారు.సినీ రాజకీయంగా బాలయ్యకు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే వివాదాల్లోనూ బాలయ్య పేరు ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఇండస్ట్రీ మొత్తం ఒక వైపు ఉన్నట్టు.. బాలయ్య మరో వైపు ఉన్నట్టు కనిపిస్తుంటుంది. అలాంటి బాలయ్య బాబు 61వ పుట్టిన రోజు నేడు (జూన్ 10). బాలయ్య బాబు బర్త్ డే సందర్భంగా నేడు సోషల్ మీడియా ఊగిపోతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా పుట్టిన రోజు వేడుకలను నిర్వహించవద్దని తమ అభిమానులను బాలయ్య కోరారు. అయితే బాలయ్య బర్త్ డే హడావిడి అంతా సోషల్ మీడియాలో కనిపిస్తోంది. HappyBirthdayNBK, హ్యాష్ ట్యాగ్‌లతో బాలయ్య బాబు బర్త్ డే నెట్టింట్లో హల్చల్ అవుతోంది. ఈ క్రమంలో బాలయ్య బాబు రికార్డుల గురించి ఓ సారి చూద్దాం. బాలయ్య బాబు సమరసింహారెడ్డి సినిమాతో కొత్త శకానికి నాంది పలికారు. ఫ్యాక్షన్ సినిమాలకు బాలయ్య పెట్టింది పేరు. సమరసింహారెడ్డి విజృంభించిన తీరుకు టాలీవుడ్ షాక్ అయింది. అలా బాలయ్య బాక్సాఫీస్ పోరులో కొత్త రికార్డులు క్రియేట్ చేశారు. ఆ తరువాత మళ్లీ నరసింహానాయుడు వేట కొనసాగించారు. టాలీవుడ్‌లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది ఈ చిత్రం. 2001లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సునామీని సృష్టించింది. అయితే బాలయ్యకు ఆ తరువాత ఒక్క హిట్ కూడా పడలేదు. విజయం కోసం దాదాపు పదేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. ఇక బాలయ్య పని అయిపోయిందని అంతా అనుకున్నారు. డిజాస్టర్ల మీద డిజాస్టర్లు వచ్చాయి. నందమూరి అభిమానులు ఒక్క హిట్ కోసం ఎదురుచూడసాగారు. అలా 2010లో బాలయ్య బాబు కొత్త అవతరాన్ని తెలుగు ప్రేక్షకులు కళ్లారా చూశారు. బోయపాటి తెరకెక్కించిన సింహా సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. ఆ ఏడాదిలో సింహా సినిమా హయ్యస్ట్ కలెక్షన్లతో రికార్డుల మోత మోగించింది. అలా అభిమానుల పదేళ్ల ఆకలిని నందమూరి సింహం.. సింహా సినిమాతో తీర్చేసింది. అలా మళ్లీ బాలయ్య హవా కొనసాగింది. మధ్యలో మళ్లీ కాస్త బ్రేకులు పడ్డట్టు అయింది. మళ్లీ బోయపాటి కాంబోలో వచ్చిన లెజెండ్ సినిమా దుమ్ములేపేసింది. ఇక చివరగా బాలయ్య రూలర్ సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచారు. ఇక ఇప్పుడు మళ్లీ బోయపాటి కాంబోలో ముచ్చటగా మూడోసారి బాలయ్య అంటూ రాబోతోన్నారు. ఇప్పటికే వదిలిన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ అన్నీ కూడా వైరల్ అయ్యాయి. బర్త్ డే సందర్బంగా వదిలిన పోస్టర్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. బాలయ్య బాబుకు ‘అఖండ’ విజయం దక్కాలని.. కోరుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు.


By June 10, 2021 at 08:17AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nandamuri-balakrishna-birthday-special-simha-movie/articleshow/83389808.cms

No comments