Breaking News

Donald Trumpకి ఫేస్‌బుక్ షాక్.. రెండేళ్ల నిషేధం.. సమర్ధించిన పర్యవేక్షణ బోర్డు


అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ క్యాపిటల్‌ భవనంపై దాడులు చేసిన మూకలను గొప్ప దేశభక్తులుగా పేర్కొనడంతో ట్విటర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సహా పలు సోషల్ మీడియా వేదికలు ఆయన ఖాతాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా, ట్రంప్‌ను రెండేళ్లపాటు నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా దిగ్గజం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పర్యవేక్షణ బోర్డు సమర్ధించింది. కానీ, అలా చేయడం సముచితం కాదని బోర్డు అభిప్రాయపడింది. ‘‘ఫేస్‌బుక్ నిరవధిక సస్పెన్షన్ అనిశ్చితమైన, ప్రామాణికమైన జరిమానా విధించడం సముచితం కాదు’’ అని వ్యాఖ్యానించింది అని ఫేస్‌బుక్ వెల్లడించింది. ‘ఈ నిర్ణయాన్ని సమీక్షించి, స్పష్టంగా, దామాషా ప్రకారం స్పందించాలని బోర్డు మాకు సూచించింది.. మా విధానాలు, ప్రక్రియలను ఎలా మెరుగుపరచాలనే దానిపై అనేక సిఫార్సులు చేసింది’ అని పేర్కొంది. ‘‘ఇలాంటి అసాధారణమైన సందర్భాల్లో వర్తించే కొత్త పర్యవేక్షణ నిబంధనలను ప్రకటించాం.. ట్రంప్ ఖాతాలకు మేము వర్తింపజేస్తున్న నిబంధనలకు అనుగుణంగా కాలపరిమితితో కూడిన జరిమానాను ధ్రువీకరిస్తున్నాం.. ట్రంప్ ఖాతాల నిలిపివేతకు దారితీసిన పరిస్థితుల దృష్ట్యా ఆయన చర్యలు మా నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించినట్టు మేం బలంగా నమ్ముతున్నాం.. ఇది కొత్తగా అమల్లోకి వచ్చిన ప్రోటోకాల్స్ పరిధిలో అత్యధిక జరిమానాకు అర్హమైంది. ఈ ఏడాది జనవరి 7 న అమలులోకి వచ్చినప్పటి నుంచి రెండేళ్లపాటు ఆయన ఖాతాలను నిలిపివేస్తున్నాం’’ అని స్పష్టం చేసింది. ‘‘ఈ గడుపు ముగిసే సమయానికి ప్రజల భద్రతకు ప్రమాదం తగ్గిందా అని అంచనా వేయడానికి మేము నిపుణులతో పరిశీలిస్తాం. హింసాత్మక ఘటనలు, శాంతి నెలకొల్పడానికి సహా బాహ్య కారకాలను అంచనా వేస్తాం... ప్రజల భద్రతకు ఇంకా తీవ్రమైన ప్రమాదం ఉందని నిర్ధారిస్తే మరోసారి దీనిని పొడిగిస్తాం.. ఆ ప్రమాదం తగ్గే వరకు తిరిగి మూల్యాంకనం చేస్తాం’’ అని వివరించింది. ‘‘చివరికి సస్పెన్షన్ ఎత్తివేసినప్పుడు భవిష్యత్తులో మరిన్ని ఉల్లంఘనలకు పాల్పడితే మరింత కఠినమైన ఆంక్షలను విధిస్తామని హెచ్చరించింది. అసాధారణమైన పరిస్థితులలో ట్రంప్‌ ఖాతాలను సస్పెండ్ చేయాలన్న మా నిర్ణయం సరైంది.. అవసరం అని పర్యవేక్షణ బోర్డు అంగీకరించినందుకు ధన్యవాదాలు. అటువంటి అసాధారణ సంఘటనలకు ప్రతిస్పందించడానికి తగిన ప్రోటోకాల్‌ల్స్ లేవని మేము ఖచ్చితంగా అంగీకరిస్తున్నాం.. ప్రస్తుతం మాత్రం ఆ నిబంధనలు అమలు చేస్తున్నాం.. అవి అరుదైన పరిస్థితులలో మాత్రమే వర్తిస్తాయని మేం ఆశిస్తున్నాం’’ అమెరికాలో క్యాపిటల్‌ భవనంపై దాడికి పాల్పడిన మూకలను గొప్ప దేశ భక్తులుగా పేర్కొంటూ ట్రంప్‌ ట్వీట్‌ చేయడం, అలాగే, ఆ నిరసనకారులను ప్రేమిస్తున్నానంటూ వీడియో విడుదల చేయడం పెద్ద దుమారం రేపింది. జో బైడెన్‌ గెలుపును ధ్రువీకరించేందుకు కాంగ్రెస్‌ ఉభయ సభలు సమావేశం కాగా.. వేలాది మంది ట్రంప్‌ మద్దతుదారులు రణరంగం సృష్టించిన విషయం తెలిసిందే.


By June 05, 2021 at 07:29AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/in-response-to-oversight-board-trump-suspended-for-two-years-says-facebook/articleshow/83251990.cms

No comments