Breaking News

Covid Vaccine డెల్టా వేరియంట్‌పై సమర్ధంగా పనిచేస్తున్న రెండు డోస్‌ల టీకాలు.. యూకే స్టడీ


డెల్టా వేరియంట్‌‌పై రెండు డోస్‌ల కోవిడ్ వ్యాక్సిన్ సమర్ధంగా పనిచేస్తూ, హాస్పిటల్‌లో చేరే అవసరాన్ని తగ్గిస్తున్నట్టు (పీహెచ్ఈ) సోమవారం వెల్లడించింది. రెండు డోస్‌ల ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ 96 శాతం కేసుల్లో రోగులకు చికిత్స అవసరాన్ని నిలిపివేసినట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అలాగే, ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకా 92 శాతం కేసుల్లో చికిత్స అవసరాన్ని తగ్గించిందని పీహెచ్ఈ తెలిపింది. మరోసారి బ్రిటన్‌లో కరోనా వైరస్ కేసుల పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఫలితాలను వెల్లడించింది. యూకేలో ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ భారత్‌లో తొలిసారి వెలుగుచూసి చెందినవే కావడం ఆందోళన కలిగిస్తోంది. మరోసారి పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో జూన్ 21 నుంచి ఆంక్షల సడలించాలనే నిర్ణయాన్ని బ్రిటన్ ప్రభుత్వం వాయిదావేసింది. ఆల్ఫా స్ట్రెయిన్ విజృంభణతో జనవరి నుంచి లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. గతేడాది డిసెంబరు నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించింది. ఫైజర్-బయెఎన్‌టెక్ వ్యాక్సిన్ పెద్ద ఎత్తున వినియోగిస్తోంది. ఇప్పటికే సగం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. ఆల్ఫా స్ట్రెయిన్‌తో పోల్చితే డెల్టా వేరియంట్‌పై వ్యాక్సిన్ సమర్ధంగా పనిచేస్తోందని పీహెచ్ఈ వివరించింది. ‘‘డెల్టా వేరియంట్ నుంచి ఆసుపత్రిలో చేరడానికి టీకాలు గణనీయమైన రక్షణను అందిస్తాయని ఈ ముఖ్యమైన ఫలితాలు నిర్ధారించాయి’’ అని బ్రిటన్ వ్యాక్సినేషన్ ప్రక్రియ చీఫ్ మ్యారీ రామ్‌సే వ్యాఖ్యానించారు. డెల్టా వేరియంట్ వల్ల మరణం ముప్పును తగ్గించి, టీకాల రక్షణ స్థాయిని నిర్ధారించడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని పీహెచ్ఈ తెలిపింది. ఇంగ్లాండ్‌లో ఏప్రిల్ 12 నుంచి జూన్ 4 మధ్య 14,019 కొత్త వేరియంట్ కేసులు నిర్ధారణ అయ్యాయి. గత విశ్లేషణలో ఆల్ఫా కంటే డెల్టా వేరియంట్ లక్షణాలు అభివృద్ధి చేసే వ్యక్తిలో ఒక్క డోస్ 17 శాతం తక్కువ ప్రభావవంతంగా ఉంటుందని సూచించింది. కానీ తాజా పరిశోధనలో రెండు డోస్‌ల తర్వాత తేడా స్వల్పంగా మాత్రమే ఉందని తేలింది. పోర్ట్స్‌మౌత్ యూనివర్సిటీ సీనియర్ లెక్చరర్ సిమోన్ కొల్‌స్టే మాట్లాడుతూ.. టీకాల కార్యక్రమం స్పష్టంగా పనిచేస్తుందని అన్నారు. బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం ఇప్పటి వరకూ 57 శాతం మంది పెద్దలకు రెండు డోస్‌లు వేశారు.


By June 15, 2021 at 10:56AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/two-doses-mostly-prevent-hospitalisation-with-delta-variant-says-public-health-england/articleshow/83533493.cms

No comments