Breaking News

ఒక్కటే జీవితం.. ఒక్కసారే బ్రతుకుతాం.. అస్సలు వదలొద్దు: పూరి జగన్నాథ్


గతేడాది లాక్ డౌన్ సమయంలో పేరుతో పలు విషయాలపై తన అభిప్రాయాలు చెబుతూ వరుస ఆడియోలు రిలీజ్ చేశారు డైరెక్టర్ . ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు లాక్ డౌన్ రావడంతో తిరిగి అదే రిపీట్ చేస్తూ వరుసపెట్టి పోడ్ కాస్ట్ ఆడియో ఫైల్స్ వదులుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా మనం తినే ఫుడ్ గురించి ఆయన ఓ సందేశమిచ్చారు. ''బుద్దిస్టుల చేతిలో ఓ బౌల్ చూసి ఉంటారు. దాన్ని బెగ్గింగ్ బౌల్ అంటారు. ఆ కాన్సెప్ట్ క్రియేట్ చేసింది బుద్ధుడు. ఆ బౌల్ నిండా ఒక మనిషికి సరిపోయే ఆహారం మాత్రమే పడుతుంది. ఈ బౌల్‌నే పాత్ర అని కూడా అంటారు. బుద్ధుడు రోజుకు ఒకసారి మాత్రమే తినమని చెప్పాడు. కానీ ఇప్పుడు బుద్ధిజం ఫాలో అయ్యే వాళ్లు రోజులో ఒకటి లేదా రెండు సార్లు ఆహారం తీసుకుంటున్నారు. మిగతా సమయం అంతా ఉపవాసం ఉంటారు. సుమారు 18 గంటలపాటు ఉపవాసం చేస్తారు. బుద్దిస్టులే కాదు మనం కూడా ఇలాంటి ఉపవాసాలు చేస్తే ఎంతో మంచింది. వీలైతే మీరు ప్లేట్‌లో కాకుండా ఈ బౌల్‌లో తినండి. బౌల్‌లో తింటే ఫుడ్ కంట్రోల్‌లో తింటాం. కానీ మనం లెక్కకు మించి ఫుడ్ తీసుకుంటాం. మన కడుపు అరిచి గోల చేసే లోపు నాలుగు బౌల్స్ లాగించేస్తాం. మనకు వచ్చే జబ్బులకు కారణం మీరు తీసుకునే ఎక్స్‌ట్రా బౌల్స్. మీరు తిండి తగ్గించాలంటే ఓరియాకీ బౌల్ సెట్‌ అని దొరుకుతుంది. దాన్ని ఆర్డర్ చేసి తెచ్చుకోండి. మరీ అంత తక్కువ తింటే నీరసం వస్తుందేమో అనుకోకండి బలంగానే ఉంటారు. మన దోసిట్లో ఒక బౌల్.. అందులో సరిపడే ఫుడ్ తినండి. ఒక్కటే జీవితం.. ఒక్కసారే బ్రతుకుతాం. ఒక్క మెతుకు కూడా వదలొద్దు'' అని పూరి జగన్నాథ్ అన్నారు.


By June 13, 2021 at 03:32PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/puri-musings-puri-jagannadh-says-about-human-health-issues/articleshow/83481044.cms

No comments