శేఖర్ కమ్ములతో ధనుష్ మూవీ.. అలాంటి కథతో మూడు భాషల్లో భారీ సినిమా ప్లాన్ చేసిన నిర్మాతలు
టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కాంబినేషన్‌లో కొత్త సినిమా రాబోతోంది. కొద్దిసేపటి క్రితం ఈ విలక్షణ కాంబోకి సంబంధించిన అధికారిక ప్రకటన జారీ చేశారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఇదో అరుదైన కాంబినేషన్ అని చెప్పుకుంటున్నారు జనం. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ చిత్రానికి నారాయణ్ దాస్ నారంగ్, రామ్మోహన్‌రావు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. తెలుగు, తమిళం, హిందీలో త్రిభాషా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. తెలుగులో నటిస్తున్న తొలి స్ట్రైయిట్ మూవీ ఇదే కావడం విశేషం. ఈ మూవీ కోసం యూత్ ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యేలా ఓ వైవిధ్యభరితమైన కథ సిద్ధం చేస్తున్నారట డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఇక ఈ మూవీలో హీరోయిన్, ఇతర తారాగణం, టెక్నీషియన్స్ ఎవరనేది అతిత్వరలో ప్రకటించనున్నారట. ఈ బిగ్ అనౌన్స్‌మెంట్ మూడు భాషల్లోని ఆడియన్స్‌లో సినిమా పట్ల కుతూహలం పెంచింది. మరోవైపు ఇదే శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై 'లవ్ స్టోరి' సినిమా రూపొందించారు దర్శకుడు శేఖర్ కమ్ముల. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేసుకొని విడుదలకు రెడీగా ఉంది. ఈ మూవీ నుంచి విడుదలైన 'సారంగ దరియా' లిరికల్ సాంగ్ పలు రికార్డులు తిరగరాసింది. బాలీవుడ్‌లో తెరకెక్కనున్న ‘అత్రాంగి రే’, హాలీవుడ్ మూవీ ‘ది గ్రే మ్యాన్’ షూట్స్‌తో ధనుష్ ఫుల్ బిజీగా ఉన్నారు. అతిత్వరలో శేఖర్ కమ్ముల- ధనుష్ కాంబో సెట్స్ మీదకు రానుందట.
By June 18, 2021 at 10:43AM
No comments