Breaking News

రాజ రాజ చోర టీజర్: గంగవ్వతో శ్రీ విష్ణు మందు పార్టీ! ఇదే నా శపథం అంటున్న యంగ్ హీరో


కెరీర్ ఆరంభం నుంచే విలక్షణ పాత్రలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు యంగ్ హీరో . ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాజ రాజ చోర’. హసిత్‌ గోలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మేఘా ఆకాశ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. సునయన ముఖ్యపాత్ర పోషిస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్న మేకర్స్ చిత్ర ప్రమోషన్స్ షురూ చేశారు. ఇందులో భాగంగా తాజాగా చిత్ర టీజర్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. ‘రాజ రాజ చోర’ టీజర్‌ని తన సోషల్ మీడియా ఖత ద్వారా షేర్‌ చేసిన హీరో శ్రీ విష్ణు.. ''ఈ పాత్రతో మీ ముందుకి రావడం నా అదృష్టం. ఈ కిరీటం ధరించినందుకు మీ పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తానన్నది నా శపథం'' అని ట్వీట్‌ చేశారు. ఇక ఈ టీజర్ చూస్తుంటే.. శ్రీ విష్ణు సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్‌గా, దొంగగా రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. 'రాజ రాజ చోర' అనే టైటిల్‌కు తగ్గట్టుగానే దొంగతనాల నేపథ్యంలో ఈ సినిమా కథ ఆసక్తికరంగా సాగుతుందని అర్థమవుతోంది. ఈ చిత్రంలో నటుడు రవిబాబు నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. యూట్యూబ్, బిగ్ బాస్ ఫేమ్ ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఆమెతో శ్రీ విష్ణు చీర్స్ అంటున్న సీన్ టీజర్‌లో హైలైట్ అయింది. సో.. చూడాలి మరి ఈ సినిమాతో శ్రీ విష్ణు ఏ రేంజ్‌లో నవ్విస్తారనేది!. ‌


By June 18, 2021 at 01:38PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/raja-raja-chora-teaser-sree-vishnu-screen-shared-with-gangavva/articleshow/83632678.cms

No comments