Breaking News

అర్ధరాత్రి రోడ్డుప్రమాదం.. సినీనటుడు కత్తి మహేష్‌కు గాయాలు


జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ విమర్శకుడు, నటుడు గాయపడ్డారు. కొడవలూరు మండలం చంద్రశేఖరపురం దగ్గర జాతీయ రహదారిపై మహేష్ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న కంటెనర్‌ను ఢీకొట్టింది. వెంటనే కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో కత్తి మహేష్‌ ప్రమాదం తప్పి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలోఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే ఆయన్ని నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో కత్తి మహేష్‌ కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయ్యింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కత్తి మహేష్‌ది సొంత జిల్లా చిత్తూరు. అక్కడి నుంచి హైదరాబాద్ వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


By June 26, 2021 at 11:13AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/cine-critic-kathi-mahesh-injured-over-road-accident-in-nellore-district/articleshow/83865397.cms

No comments