Breaking News

డాక్టర్లపై పగబట్టిన కరోనా... సెకండ్ వేవ్‌‌లో ఎంతమంది చనిపోయారో తెలుసా?


కరోనా సెకండ్ వేవ్‌లో సామాన్య ప్రజలతో పాటు వైద్యులు కూడా భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా కరోనాతో 594 మంది డాక్టర్లు మృతి చెందినట్లు ప్రకటించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మరణించిన వారి వివరాలను తన నివేదికలో ప్రచురించింది. ఢిల్లీలో అత్యధికంగా 108 డాక్టర్లు చనిపోగా... బీహార్‌లో 98 మంది, యూపీలో 67 మంది మరణించారని పేర్కొంది. రాజస్థాన్‌లో 43, ఝార్ఖండ్‌లో 39, ఏపీ 32, తెలంగాణలో 32, తమిళనాడులో 21, మహారాష్ట్రలో 17, మధ్యప్రదేశ్‌లో 16 మంది డాక్టర్లు కోవిడ్‌తో మరణించారు. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించినట్లు ఐఎంఏ వెల్లడించింది. కోవిడ్‌తో ఎవరైనా చనిపోతే వారి కుటుంబసభ్యులు డాక్టర్లు, వైద్య సిబ్బందిపై దాడులు పాల్పడటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి హింసాత్మక ఘటనల మధ్య విధులు నిర్వహించేందుకు డాక్టర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అభిప్రాయపడింది. ఇలాంటి చర్యలను అరికట్టేందుకు పటిష్ట చట్టం రూపొందించాలని కేంద్రాన్ని కోరింది.


By June 02, 2021 at 11:17AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/second-wave-of-covid-saw-594-doctors-dead-says-indian-medical-assciation/articleshow/83166352.cms

No comments