Breaking News

లక్కీ లాటరీ గెలుచుకున్న బ్రహ్మాజీ.. కోట్లలో సొమ్ము! అది మీకే అంటూ ఫోన్ నెంబర్ ఇచ్చిన యాక్టర్


లక్కీ లాటరీలో డబ్బులొస్తే ఆ ఆనందమే వేరు. అది కూడా కోట్ల రూపాయల్లో వస్తే ఇంకేమన్నా ఉందా!. ఏ మాత్రం కష్టపడకుండానే లక్షలు, కోట్లు వచ్చాయని తెలిసి తెగ సంతోషంతో ఆకాశంలో విహరిస్తుంటారు జనం. సరిగ్గా దాన్నే ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు పంజా విసరడం చూస్తున్నాం. టెక్నాలజీ విస్తృతం కావడంతో ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు మరీ ఎక్కువయ్యాయి. కోట్లలో ఆశ చూపి పర్సనల్ ఇన్ఫర్మషన్ అంతా లాగి ఖాతాలు ఖాళీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. యాక్టర్ విషయంలో ఇదే జరగడంతో వెంటనే ఆయన పోలీసులకు ఆ విషయం చెప్పేశారు. మీ ఫోన్ నెంబర్‌కి నాలుగు కోట్ల 65 లక్షల రూపాయల లాటరీ తగిలిందని, యునైటెడ్ కింగ్డమ్‌కి చెందిన ల్యాండ్ రోవర్ కంపెనీ నుంచి మీకు ఈ నగదు అందనుందని పేర్కొంటూ బ్రహ్మాజీకి మెసేజ్ వచ్చింది. అయితే ఈ సొమ్ము కలెక్ట్ చేసుకోవాలంటే మీ పేరు, ఫోన్ నెంబర్, వయస్సు, అడ్రస్, వృత్తి లాంటి వివరాలతో ఒక మెయిల్ ఐడికి మెయిల్ చేయాలని అందులో పేర్కొన్నారు. ఇది చూశాక బ్రహ్మాజీ ఓ ఐడియా తట్టింది. ఎలాగూ ఫేక్ అని గుర్తించాడు కాబట్టి ఆ దొంగలను పట్టించేలా ఆ మెసేజ్ స్క్రీన్ షాట్ తీసి ఏకంగా పోలీసులకు ట్యాగ్ చేశాడు బ్రహ్మాజీ. అంతేకాదండోయ్.. తనదైన స్టైల్‌లో ఆలోచన చేసి 'సార్, ఈ నంబ‌ర్ నుంచి నాకు మెసేజ్ వ‌చ్చింది. ద‌య‌చేసి ఆ సొమ్ము మీరే తీసుకోండి' అంటూ తనకు వచ్చిన ఫోన్ నంబర్ కూడా ఇస్తూ సైబరాబాద్ పోలీసులకు ట్యాగ్ చేశాడు బ్రహ్మాజీ. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్ కావడమే గాక, ఇలాంటి ఫ్రాడ్ మెసేజీల పట్ల చాలామందికి అవగాహన కల్పించినట్లయింది. వెండితెరపై విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్నారు బ్రహ్మాజీ. పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా రాబోతున్న 'అయ్యప్పనుమ్ కోషియం' సినిమాలో బ్రహ్మాజీని ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో దగ్గుబాటి రానా దగ్గర పని చేసే డ్రైవర్ పాత్రలో ఆయన కనిపించబోతున్నాడట.


By June 18, 2021 at 07:49AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actor-brahmaji-police-complaint-on-lottery-winning/articleshow/83623969.cms

No comments