Breaking News

Anbariv : కమల్ హాసన్ కోసం భారీ యాక్షన్.. రంగంలోకి దిగిన కేజీయఫ్ స్టంట్ మాస్టర్స్


యూనివర్సల్ హీరో ఇక మొహానికి రంగు వేసుకునేందకు సిద్దపడ్డట్టు కనిపిస్తోంది. ఆ మధ్య ఇండియన్ 2 షూటింగ్ ప్రమాదం జరగడంతో అది కాస్తా వాయిదా పడింది. ఇండియన్ 2 ప్రమాదం ఎంతటి వివాదాన్ని రాజేసిందో అందరికీ తెలిసిందే. నిర్మాతలు, దర్శకుడు, హీరోకు ఇండియన్ 2 ఓ చేదు అనుభవాన్ని మిగిల్చినట్టైంది. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ అటకెక్కినట్టు తెలుస్తోంది. ఆ తరువాత కమల్ హాసన్ తన రాజకీయాలతో బిజీగా ఉన్నారు. అన్నీ చోట్లా ఓడిపోవడంతో మళ్లీ ఇప్పుడు సినిమాలతో బిజీ అవ్వాలని ప్రయత్నిస్తున్నట్టున్నారు. ఈ క్రమంలో కమల్ తన ప్రాజెక్ట్‌లను మళ్లీ లైన్‌లో పెడుతున్నారు. ఈ క్రమంలో లోకేష్ కనకరాజ్‌తో చేస్తోన్న ప్రాజెక్ట్‌ను ముందు పూర్తి చేయాలనే చూస్తున్నట్టున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఆ మధ్య వదిలిన ఓ చిన్న టీజర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. స్టైలీష్ లుక్కులో, వెరైటీ గెటప్పులో, గన్నులు,కత్తులు ఇలా వెరైటీ వెరైటీ ఆయుధాలతో కమల్ హాసన్ దాడి చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అలా కమల్ హాసన్ విక్రమ్ సినిమా మీద అందరికీ అంచనాలు ఏర్పడ్డాయి. ఖైదీ, మాస్టర్ సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు .. ఈ చిత్రంతో మరో ప్రయోగం చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక చిత్రంలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను లోకేష్ ప్లాన్ చేసినట్టున్నారు. అందుకోసం ఏకంగా కేజీయఫ్ స్టంట్ మాస్టర్స్ అంబ్‌అరివ్‌‌లను తీసుకొచ్చారు. ఈ మేరకు చిత్రయూనిట్‌లోకి అడుగుపెట్టినందుకు అంబ్‌అరివ్‌‌లకు స్వాగతం పలికారు లోకేష్. కమల్ హాసన్ సర్‌తో పని చేయడం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉందని చెప్పుకొచ్చారు.


By June 13, 2021 at 08:17AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/anbariv-on-board-for-kamal-haasan-lokesh-kanagaraj-movie/articleshow/83475977.cms

No comments