Breaking News

అమ్మాయి అసభ్యంగా మాట్లాడితే రూ.5 లక్షలు.. మూడేళ్లలో రూ.75 కోట్లు గడించిన పబ్జీ మదన్!


మహిళలతో పబ్జీ ఆడుతూ, వారితో అసభ్యంగా మాట్లాడుతూ ఆ ఆడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసి భారీగా సంపాదిస్తున్న ‘పబ్జీ మదన్‌’ భాగోతం బట్టబయలయ్యింది. దంపతులను పోలీసులకు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అసభ్య ఆడియోలే పెట్టుబడిగా మూడేళ్లలోనే రూ.75 కోట్ల వరకు ఆర్జించినట్టు తెలిసి పోలీసులు విస్తుపోయారు. నిందితుడు మదన్‌, అతడి భార్య కృత్తిక బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.4 కోట్ల నగదును కూడా సీబీసీఐడీ స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులో సంచలనంగా మారిన ‘పబ్జీ మదన్‌’ లీలలపై పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. మదన్‌తో వ్యక్తిగతంగా జరిపిన సంభాషణ యూట్యూబ్‌లలో బహిర్గతం కావడంతో బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నైలోని వేంగైవాసల్‌కు చెందిన మదన్‌ ఇంజనీరింగ్‌ చదివి.. పబ్జీ గేమ్‌ ఆడుతూ, పలువురు మహిళలను కూడా ఆటవైపు ఆకర్షించాడు. ఈ క్రమంలో వారితో అసభ్యంగా మాట్లాడుతూ.. ఆ సంభాషణలను రికార్డు చేసి సదరు మహిళలకు తెలియకుండా ఆడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసేవాడు. మదన్‌ యూట్యూబ్‌ ఛానెల్స్‌కు లక్షలాది మంది వీక్షకులు సబ్‌స్క్రైబ్ చేసుకోవడంతో అతడికి ఆదాయం భారీగా దక్కేది. ఇలా మూడేళ్లలో రూ.75 కోట్ల మేరకు సంపాదించినట్టు పోలీసుల విచారణలో వెల్లడయినట్టు తెలుస్తోంది. భార్య కృత్తికతో కలిసి దాదాపు పదికిపైగా యూట్యూబ్‌ చానెళ్లను నడుపుతూ మదన్ భారీగా సంపాదించాడు. మదన్‌కు అతని భార్య పూర్తిగా సహకరించినట్లు విచారణలో తేలింది. ఈ కేసులో మదన్‌కు సహకరించిన స్నేహితుల వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. తనతో బాగా అసభ్యంగా మాట్లాడిన మహిళలకు మదన్‌ రూ.5 లక్షల వరకు ప్రోత్సాహక బహుమతి ఇచ్చినట్టు పోలీసులకు సాక్ష్యాలు లభించాయి. దీంతో అసభ్యంగా మాట్లాడిన మహిళల జాబితాను పోలీసులు సిద్ధం చేశారు. మరి కొందరు యువతులు మదన్‌కు భారీగా డబ్బులు ఇచ్చి, మోసపోయినట్లు కూడా గుర్తించారు. బాధితుల సంఖ్య మరింత పెరగవచ్చని పోలీసువర్గాలు భావిస్తున్నాయి. మదన్‌, అతడి భార్యను అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు తరలించారు. మదన్, టాక్సిన్ మదన్ 18 ప్లస్, పబ్జి మదన్ గర్ల్ ఫ్యాన్, మదన్ ఎగ్రీ ఎట్ హిస్ గర్ల్‌ఫ్రెండ్, స్ట్రిక్ట్‌లీ 18 ప్లస్, రిచై గేమింగ్ వైటీ పేరుతో 10కిపైగా యూట్యూబ్ ఛానెల్స్‌ను నడుపుతున్నారు. ఈ యూట్యూబ్ చానెల్స్ ఫాలోవర్స్‌లో చాలా మంది మైనర్లే కావడం గమనార్హం. గత గురువారం ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టులో నిందితుడు మదన్ కుమార్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ సందర్బంగా న్యాయస్థానం విస్మయం వ్యక్తం చేసింది. పబ్జీతోనే కోట్లు గడించిన మదన్‌కు మూడు ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇందులో రెండు అడి కంపెనీవే కావడం గమనార్హం.


By June 20, 2021 at 02:45PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/tamil-nadu-youtuber-madan-kumar-couple-arrested-for-obscenity-on-pubg-live-stream/articleshow/83685855.cms

No comments