Breaking News

38 మంది భార్యల జియోన మృతి.. ఒంటరైన ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యామిలీ


ప్రపంచంలో అతిపెద్ద కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న (76) ఆదివారం కన్నుమూశారు. మిజోరాంలోని మధ్య సెర్‌చిప్ జిల్లా బక్తావంగ్ త్లాంగ్‌నమ్‌ గ్రామానికి చెందిన జియోన చనాకు 38 మంది భార్యలు, 89 మంది పిల్లలు, 33 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. చనా మృతిపై మిజోరం ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోరాంతంగ భారమైన హృదయంతో సంతాపం తెలిపారు. ‘మీ కుటుంబం కారణంగానే రాష్ట్రంలో పెద్ద పర్యాటక కేంద్రంగా మీ గ్రామం ఉండేది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి’ అని ట్వీట్‌ చేశారు. డయాబెటిస్‌, బీపీలతో బాధపడుతున్న జియోన మిజోరం రాజధాని ఐజ్వాల్‌లోని ట్రినిటీ ఆసుపత్రిలో ఆదివారం మధ్యాహ్నం మృతిచెందారు. స్వగ్రామం బక్తావంగ్‌ త్లాంగ్‌నామ్‌లోని చనాస్‌ వర్గానికి ఈయనే పెద్ద. జులై 21, 1945లో జన్మించిన జియోన పదిహేడేళ్ల వయసులో తొలి వివాహం చేసుకున్నారు. మొదటి భార్య జతియంగ్ ఆయన కంటే మూడేళ్లు పెద్దది కావడం విశేషం. వంద గదులున్న నాలుగంతస్తుల భవనంలో ఈ కుటుంబం నివసిస్తోంది. విశ్రాంత గదులు వేరైనా అందరికీ వంటగది ఒక్కటే. జియోన పడకగదికి దగ్గరలోని డార్మెటరీలో ఆయన భార్యలు ఉండేవారు. కుటుంబ పోషణకు సరిపడా ఆర్థిక వనరులున్నా బయటి నుంచి కూడా విరాళాలు అందేవి. ‘నా మతాన్ని విస్తరించే క్రమంలో నేను వివాహం చేసుకోవడానికి అమెరికా కూడా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని ఒకప్పుడు చనా చెప్పేవారు. కాగా, ఓ ఇంటర్వ్యూలో చనా కుమారులు మాట్లాడుతూ.. తమ తాత ముత్తాలకు కూడా చాలా మంది భార్యలు ఉండేవారని అన్నారు. పేద మహిళలను చూసి పెళ్లిచేసుకోనేవారని తెలిపారు. కాగా, చనా కుటుంబం వల్ల బక్తావంగ్ త్లాంగ్‌నమ్ మిజోరంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది.


By June 14, 2021 at 06:54AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/mizoram-man-ziona-chana-who-had-38-wives-and-89-children-passes-away-at-76/articleshow/83499282.cms

No comments