Breaking News

క్రేన్‌ను ఢీకొట్టి బోల్తా పడిన బస్సు.. 17 మంది మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి


ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. కాన్పూర్‌ జిల్లా సచేంది ప్రాంతంలో మంగళవారం సాయంత్రం హైవేపై వేగంగా ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి జేసీబీని ఢొకొట్టింది. ఆ తీవ్రతకు జేసీబీ రోడ్డు పక్కకు పడిపోగా... బస్సు పల్టీలు కొట్టుకుంటూ పక్కనే ఉన్న గుంతలోకి జారిపోయింది. దీంతో ప్రయాణికులంతా బస్సులోనే ఇరుక్కుపోయారు. ఈ ఘటనలో 17 మంది చనిపోగా... 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ప్రమాద సమాచారం తెలియగానే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. ప్రధాని మోదీ ఈ ఘోర ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి సహాయ నిధి కింద మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున సాయం చేస్తామని హామీ ఇచ్చారు.


By June 09, 2021 at 08:06AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/17-killed-as-bus-collides-with-loader-near-kanpur-pm-modi-announces-rs-2-lakh-ex-gratia-to-kin-of-deceased/articleshow/83358556.cms

No comments