Breaking News

ఆస్పత్రి నిర్లక్ష్యంతో గత నెలలో కొడుకు మృతి.. MLA ఫిర్యాదును పట్టించుకోని పోలీసులు!


ప్రయివేట్ ఆస్పత్రి నిర్లక్ష్యం కారణంగా తన కుమారుడు చనిపోయాడని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఓ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజుల నుంచి పోలీసులకు మొరపెట్టుకున్నా ఎఫ్ఐఆర్ నమోదుచేయాలేదని యూపీకి చెందిన వాపోయారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఫిర్యాదుచేసినా పోలీసులు ఖాతరుచేయకపోవడం గమనార్హం. యూపీలోని శాండిలా నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ అగర్వాల్.. పోలీసులపై ఆరోపణలు గుప్పించారు. ఎమ్మెల్యే కుమారుడు ఆశిష్ (35) గత నెలలో కోవిడ్ బారినపడ్డారు. అతడిని కకోరిలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేర్చించగా.. చికిత్స పొందుతూ ఏప్రిల్ 26న చనిపోయాడు. అయితే, ఆస్పత్రి నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు చనిపోయాడని ఎమ్మెల్యే ఆరోపించారు. చనిపోయిన రోజు ఉదయం వరకూ తన కుమారుడు బాగానే ఉన్నాడని, ఆహారం తీసుకున్నాడని అన్నారు. సాయంత్రానికే ఆక్సిజన్ స్థాయిలు పడిపోయినట్టు వైద్యులు చెప్పారని, బయట నుంచి ఆక్సిజన్ సిలిండర్‌ను తీసుకొస్తే ఆస్పత్రి లోపలకు అనుమతించలేదన్నారు. ‘‘ఏప్రిల్ 26 ఆశిష్ ఆక్సిజన్ లెవెల్స్ 94గా ఉన్నాయి.. భోజనం కూడా చేసినట్టు తనతో చెప్పాడు.. సాయంత్రం హఠాత్తుగా ఆక్సిజన్ స్థాయిలు పడిపోయినట్టు వైద్యులు తెలిపారు.. ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో బయట నుంచి సిలిండర్ తెచ్చాం.. కానీ, వైద్యులు అనుమతించలేదు.. దీంతో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయాడు’’ అని ఎమ్మెల్యే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆస్పత్రి యాజమాన్యం, వైద్యుల నిర్లక్ష్యం వల్లే నా కుమారుడు చనిపోయాడని, న్యాయకోసం ప్రయత్నిస్తుంటే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేయడం లేదని అన్నారు. ‘‘ఆస్పత్రిలో ఆ రోజు ఏడుగురు చనిపోయారు.. దీని గురించి సీఎం, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, డీజీపీలకు ఫిర్యాదు చేశారు.. ఈ రోజు వరకూ నా ఫిర్యాదును పట్టించుకోలేదు.. ఆస్పత్రిలోని సీసీటీవీ ఫుటేజ్‌లను విశ్లేషించి, నా కుమారుడి మరణానికి కారకులైనవారికి గుర్తించారు.. దీనికి బాధ్యులైన వైద్యులను శిక్షించాలి’’ అని డిమాండ్ చేశారు. యూపీలో ఇప్పటి వరకూ అధికారిక లెక్కల ప్రకారం.. కరోనాతో 20వేల మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం అక్కడ 2,400 కేసులు నమోదు కాగా.. 159 మంది చనిపోయారు. గత పది రోజుల నుంచి యూపీలో పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం అక్కడ 5,2244 యాక్టివ్ కేసులున్నాయి.


By May 29, 2021 at 01:27PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/police-not-filing-complaint-up-bjp-mla-alleges-negligence-of-son-death/articleshow/83059472.cms

No comments