Breaking News

CBI.. కొత్త డైరెక్టర్‌గా ఆయన.. జస్టిస్ ఎన్వీ రమణ కొత్త రూల్‌తో దక్కిన పదవి!


సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కొత్త డైరెక్టర్‌గా ప్రస్తుత చీఫ్ సుబోధ్ కుమార్ జైశ్వాల్‌ నియమితులయ్యారు. మహారాష్ట్ర కేడర్‌కు చెందిన సుబోధ్‌ కుమార్‌ జైశ్వాల్‌‌ను ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ, లోక్‌సభలో విపక్షనేత అధీర్‌రంజన్‌ చౌధురిల త్రిసభ్య కమిటీ ఎంపిక చేసింది. మొత్తం 109 మంది జాబితా నుంచి వడపోసి జైశ్వాల్‌‌వైపు మొగ్గుచూపారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఫిబ్రవరిలో ఆర్కే శుక్లా పదవీ విరమణ చేయడంతో... మూడు నెలలుగా తాత్కాలిక అధికారితో నడుస్తోంది. ప్రస్తుతం సీఐఎస్ఎఫ్ డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్న ఎస్కే జైశ్వాల్.. రీసర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌ (రా)లోనూ తొమ్మిదేళ్ల పనిచేశారు. ఈ ఏడాది జనవరిలో డిప్యుటేషన్‌‌పై కేంద్ర సర్వీసులకు వచ్చారు. సీబీఐ డైరెక్టర్‌ పదవికి వడపోత జాబితాలో బిహార్‌ కేడర్‌కు చెందిన ఎస్‌ఎస్‌బీ డైరెక్టర్‌ జనరల్‌ కుమార్‌ రాజేష్‌చంద్ర, ఏపీ కేడర్‌ అధికారి వీఎస్‌కే కౌముదికంటే జైశ్వాలే అత్యంత సీనియర్‌. దీంతో కేంద్రం ఆయనవైపే మొగ్గు చూపింది. గతంలో మహారాష్ట్ర డీజీపీగా, ముంబయి పోలీసు కమిషనర్‌గా పనిచేశారు. ఎస్‌పీజీ, ముంబయి యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌, మహారాష్ట్ర స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం, స్టేట్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌లోనూ సేవలందించారు. అప్పట్లో సంచలనం సృష్టించిన అబ్దుల్ కరీమ్ తెల్గీ స్టాంపుల కుంభకోణంపై జైశ్వాల్ దర్యాప్తు చేశారు. మహారాష్ట్రలో నక్సల్స్ ప్రభావం అధికంగా ఉన్న గడ్చిరోలి జిల్లాలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. వివాదాస్పద ఎల్గార్‌ పరిషద్‌, బీమా కోరెగావ్‌ కుట్ర కేసులను కూడా సీబీఐకి అప్పగించకముందు ఈయనే పర్యవేక్షించారు. మరో ఆరు నెలల్లోపు పదవీ విరమణ చేయబోయే అధికారుల పేర్లను ఈ పదవికి పరిశీలించకూడదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు గురించి తాజాగా ప్రధానమంతి నేతృత్వంలో జరిగిన సీబీఐ డైరెక్టర్‌ ఎంపిక కమిటీ సమావేశంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ ప్రస్తావించారు. దీంతో జులై 31న పదవీ విరమణ చేయబోయే 1984 బ్యాచ్‌ గుజరాత్‌ కేడర్‌ ఐపీఎస్‌ అధికారి, సీబీఐ మాజీ స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేష్‌ ఆస్థానా, ఈ నెలాఖరులోపు పదవీ విరమణ చేయబోయే అదే బ్యాచ్‌కు చెందిన అస్సాం-మేఘాలయ కేడర్‌కు చెందిన మరో ఐపీఎస్‌ అధికారి వైసీ మోదీల పేర్లను పక్కన పెట్టాల్సి వచ్చింది.


By May 26, 2021 at 09:37AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/cisf-director-general-subodh-kumar-jaiswal-appointed-as-cbi-new-director/articleshow/82964237.cms

No comments