Breaking News

రహస్యంగా పెళ్లిచేసుకున్న బ్రిటన్ ప్రధాని.. వందేళ్ల తర్వాత పీఎం హోదాలో పెళ్లి!


బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తన ప్రియురాలు క్యారీ సైమండ్స్‌ను రహస్యంగా వివాహం చేసుకున్నట్లు యూకే మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సెంట్రల్‌ లండన్‌లో జరిగిన ఈ వివాహానికి చివరి నిమిషంలో అతిథులను ఆహ్వానించారు. ఈ పెళ్లి గురించి ప్రధాని కార్యాలయంలో సీనియర్‌ అధికారులకు కూడా కనీసం సమాచారం లేకపోవడం గమనార్హం. పెళ్లి జరిగిన కేథలిక్‌ కెథడ్రాల్‌ని మధ్యాహ్నం 1.30 సమయంలో మూసివేశారు. ఓ అరగంట తర్వాత 33 ఏళ్ల క్యారీ సైమండ్స్ లిమోజిన్‌ వాహనంలో అక్కడకు చేరుకున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో వివాహాలు, వేడుకలకు 30 మంది అతిథులుమాత్రమే ఉండాలనే నిబంధన అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో దీనిపై బ్రిటన్‌ ప్రధాని అధికార నివాసమైన డౌనింగ్‌ స్ట్రీట్‌ ప్రతినిధి స్పందించేందుకు నిరాకరించారు. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న జాన్సన్‌ , సైమండ్స్‌‌లు.. 2019 నుంచి డౌనింగ్‌ స్ట్రీట్‌లో ఉంటున్నారు. గతేడాది నిశ్చితార్థం జరిగింది. 2020 ఏప్రిల్‌లో వీరికి ఒక బాబు పుట్టాడు. వచ్చే ఏడాది జులైలో వీరు వివాహం చేసుకుంటారని ప్రచారం జరిగింది. కానీ, హఠాత్తుగా పెళ్లి చేసుకోవడం బ్రిటన్‌లో చర్చనీయాంశమవుతోంది. వివాహ బంధం విషయమై గతంలో ప్రధాని బోరిస్ జాన్సన్‌ పలు విమర్శలు ఎదుర్కొన్నారు. వివాహేతర సంబంధం గురించి అబద్ధం చెప్పడంతో కన్జర్వేటీవ్‌ పార్టీ పాలసీ బృందం నుంచి ఆయన తొలగించారు. ఇక, 55 ఏళ్ల జాన్సన్‌కు గతంలో రెండు వివాహాలు జరగ్గా... విడాకులు తీసుకున్నారు. తొలి భార్యకు ఒకరు.. రెండో భార్య మారినా వేలర్‌కు నలుగురు సంతానం. అయితే, చివరిసారిగా 1822లో నాటి ప్రధాని లార్డ్ లివర్‌పూల్ పదవిలో ఉండగానే వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇన్నాళ్లకు ప్రధాని హోదాలో పెళ్లి చేసుకోవడం విశేషం. ప్రధానికి రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నార్తర్న్ ఐర్లాండ్ మంత్రి అర్లేనా ఫోస్టర్ ట్విట్టర్ ద్వారా బోరిస్ జాన్సన్, క్యారీ సిమండ్స్‌కు శుభాకాంక్షలు


By May 30, 2021 at 12:57PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/uk-pm-boris-johnson-marries-fiancee-in-secret-ceremony/articleshow/83083531.cms

No comments