Breaking News

మరోసారి బాలయ్య బాబు అదే ప్రయోగం.. అలా ఎన్టీఆర్‌కు ఘన నివాళి ఇవ్వబోతున్న నందమూరి నటసింహం


నందమూరి నటసింహం వాక్చాతుర్యం గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. వేదికపైకి ఎక్కి స్పీచ్ ఇస్తూ శ్లోకాలు మొదలు పెట్టారంటే ఆ స్పీడు చూసి అంతా షాకవుతుంటారు. ఎవరేమనుకున్నా సరే మొదటినుంచి తనదారి తనదే అన్నట్లుగా దూసుకుపోతున్న బాలయ్య బాబు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘన నివాళి ప్లాన్ చేశారు. ఈ మేరకు స్పెషల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ నందమూరి అభిమానులను హూషారెత్తించారు. ఎన్టీఆర్ జయంతి అంటే ఎన్టీఆర్ నందమూరి అభిమానులకు ఓ పండగ లాంటిది. ప్రతి ఏడాది నందమూరి ఫ్యాన్స్‌తో పాటు కుటుంబ సభ్యులు ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటారు. మే 28వ తేదీ అనగా రేపే ఆ స్పెషల్ డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం రోజు ఉదయాన్నే ఓ చిన్న సర్‌ప్రైజ్ రాబోతుందని ప్రకటించిన ఎన్‌బీకే ఫిల్మ్స్ సంస్థ తాజాగా మరో ట్వీట్ చేసింది. 'తన తండ్రి, దివంగత నాయకుడు నందమూరి తారక రామారావుకు ఘన నివాళి ఇవ్వాలన్న ఉద్దేశంతో నందమూరి బాలకృష్ణ '' శ్లోకం మొత్తాన్ని స్వయంగా ఆలపించారు. ఇందుకు సంబంధించిన వీడియో మే 28 అంటే రేపు ఉదయం 9.45 గంటలకు విడుదల కాబోతుంది' అని ప్రకటించింది ఎన్‌బీకే ఫిల్మ్స్. ఈ వీడియోను ఎన్‌బీకే ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానెల్‌లో చూడొచ్చని పేర్కొంది. ప్రస్తుతం బాలయ్య బాబు- బోయపాటి శ్రీను క్రేజీ కాంబోలో 'అఖండ' మూవీ తెరకెక్కుతోంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ''సింహా, లెజెండ్'' సినిమాల తర్వాత అదే కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


By May 27, 2021 at 11:26AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nandamuri-balakrishna-special-plan-for-ntr-jayanthi/articleshow/82996994.cms

No comments