Breaking News

కరోనాపై పోరులో అమెరికా గొప్ప విజయం.. మాస్క్ తప్పనిసరి నిబంధనకు చెల్లు!


కోవిడ్-19పై పోరులో అగ్రరాజ్యం అమెరికా కీలక మైలురాయిని అందుకుంది. ఈ నేపథ్యంలో కోవిడ్ నిబంధనల్లో మార్పులు చేసింది. రెండు డోస్‌ల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై అధ్యక్షుడు హర్షం వ్యక్తం చేశారు. కరోనాపై సుదీర్ఘ పోరాటంలో ఇదో గొప్ప రోజు అని ఆయన వ్యాఖ్యానించారు. ఏడాదిన్నరగా మాస్క్‌లు ధరించాలని ప్రజలకు పదే పదే సూచించిన తాజాగా నిబంధనలు సవరించింది. ‘‘కోవిడ్ టీకా రెండు డోస్‌లు తీసుకున్నవారు ఎవరైనా బహిరంగ, అంతర్గత కార్యకలాపాల్లో పాల్గొంటే మాస్క్ ధరించడం, భౌతికదూరం వంటి నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు’’ సీడీసీ డైరెక్టర్ రోచెల్లీ వాలెన్‌స్కీ వెల్లడించారు. మీరు పూర్తిగా టీకాలు వేసుకుంటే మహమ్మారి కారణంగా నిలిచిపోయిన కార్యకలాపాలను ప్రారంభించవచ్చని వ్యాఖ్యానించారు. సీడీసీ నిర్ణయంపై అధ్యక్షుడు జో బైడెన్ శ్వేతసౌధం నుంచి మాట్లాడుతూ.. ఉద్వేగానికి గురయ్యారు. కరోనాపై పోరులో ఇదో గొప్ప విజయమని ప్రకటించారు. అమెరికాలో 580,000 లక్షల మందిని మహమ్మారి పొట్టనబెట్టుకుందన్నారు. ‘‘ఇదో చరిత్రాక మైలురాయి.. చాలా గొప్ప రోజు’’ అని బైడెన్ అభివర్ణించారు. సీడీసీ నిర్ణయం కొంతమందికి సంతోషాన్ని కలిగించింది.. కానీ, కాని మరికొందరు మాస్క్‌లు ధరించడం కొనసాగిస్తామని చెప్పారు. ‘‘నేను బయటకు వెళ్తే ఇప్పటికీ మాస్క్ ధరిస్తాను.. ఇది తొందరపాటు నేను అనుకుంటున్నాను.. మనం ముప్పు నుంచి బయటపడ్డామని నమ్మడం కొంచెం ప్రమాదకరం’’ అని ’’ అని ఫ్లోరిడాకు చెందిన ముబారక్ దహీర్ అనే ఓ 57 ఏళ్ల వ్యక్తి అన్నారు. ఇది చాలా మంచి వార్త.. 14 నెలలుగా మాస్క్‌ ధరిస్తున్నామని బట్ డెస్మాండ్ అనే మరో 67 ఏళ్ల వ్యక్తి సంబరపడ్డారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. అందుబాటులో ఉన్న టీకాలు కోవిడ్‌పై అధిక ప్రభావం చూపుతుంది.. కరోనాను నివారించడమే కాకుండా, లక్షణాలు ఉన్నవారు లేదా లక్షణాలు లేని లేనివారి నుంచి వ్యాప్తిని నిరోధిస్తుంది. అమెరికాలో దాదాపు 60 శాతం మంది పెద్దలు ఒకటి కంటే ఎక్కువ డోస్‌లు అందజేశారు. అక్కడ కేసులు వేగంగా తగ్గిపోతున్నాయి. ఇక, 12-15 ఏళ్ల మధ్య చిన్నారులకు గురువారం నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఇదిలా ఉండగా, సీడీసీ వెబ్‌సైట్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం.. విమానాలు, బస్సులు, రైళ్లు, ఇతర ప్రజా రవాణాలో ప్రయాణించినప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. అలాగే, రెండు డోస్‌ల టీకా వేసుకున్న విదేశీయులు అమెరికాలో వస్తే మూడు రోజలు ముందుగానే కోవిడ్ పరీక్ష చేయించుకుని నెగెటివ్ సర్టిఫికెట్ వెంట తెచ్చుకోవాలి. కోవిడ్ బారినపడి కోలుకున్నవారు మాస్క్ వదులుకునే ముందు వైద్యుడితో మాట్లాడాలని వాలెన్‌స్క్రీ అన్నారు. అంతేకాదు, పరిస్థితి మరింత దిగజారితే మార్గదర్శకాలలో మార్పులు చేస్తామని స్పష్టం చేశారు.


By May 14, 2021 at 09:19AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-lifts-mask-guidance-for-fully-vaccinated-people/articleshow/82624259.cms

No comments