Breaking News

అలా షాకిచ్చిన ‘చిట్టి’.. అసలు గుట్టు విప్పిన ఫరియా అబ్దుల్లా


ఒక్కోసారి ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో.. ఎవరి దశ ఎలా తిరుగుతుందో చెప్పలేం. అలా ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ టాప్ సెలెబ్రిటీలను కట్టిపడేశారు. ఏకంగా ప్రభాస్ లాంటి హీరో కూడా ఫరియా ఫిజిక్ మీద కామెంట్ చేసేశారు. అలా సినిమాతో ఫరియా కూడా ఓ రత్నంగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. చిట్టిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు. ఫరియా కంటే చిట్టి అనే జనాలు ఎక్కువగా గుర్తు పెట్టుకున్నారు. అలా ఈ చిట్టి సోషల్ మీడియాలో చేసే అల్లరి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. హైద్రాబాద్ పిల్ల అయిన ఫరియా.. యూట్యూబ్‌లో ఫుల్ ఫేమస్. జాతి రత్నాలు బాగా హిట్ అవ్వడమే కాకుండా చిట్టి పాత్రకు మంచి ఫాలోయింగ్ వచ్చేసింది. అలా చిట్టి అందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు. అలా సోషల్ మీడియాలో ఫరియాకు విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది. మొన్నీ మధ్య డ్యాన్స్ ప్లస్ షో ఫినాలే ఎపిసోడ్ జరిగింది. ఈ వేడుకలో ఫరియా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. యశ్ మాస్టర్‌తో కలిసి ఫరియా వేసిన స్టెప్పులు వైరల్ అయ్యాయి. అయితే నేడు ఓ వార్త ట్రెండ్ అయింది. ఫరియా అబ్దుల్లా బర్త్ డే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఇదే విషయం గురించి ఫరియా మాట్లాడుతూ షాకిచ్చారు. అసలు ఈ రోజు నా బర్త్ డేనే కాదు.. కానీ అందరూ విషెస్ చెబుతున్నారు.. ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారంటూ తెగ నవ్వేశారు. అయినా తనకు బర్త్ డే విషెస్ చెప్పిన వారికి థ్యాంక్స్ అని ఫరియా అన్నారు.


By May 28, 2021 at 03:34PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/faria-abdullah-about-her-birthday-wishes/articleshow/83033025.cms

No comments