Breaking News

పెళ్లింట విషాదం.. నలుగురి ప్రాణాలు తీసిన పెళ్లిపందిరి


వివాహ వేడుకతో సందడిగా ఉన్న ఓ ఇంట విషాదం నెలకుంది. అప్పటి వరకూ ఆనందంగా ఉన్నవారిని పిడుగుల రూపంలో మృత్యువు కబలించింది. విద్యుదాఘాతంతో పెళ్లింట నలుగురు మృతిచెందిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్‌పూర్ గ్రామంలో వివాహ వేడుక జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, గాలివాన విరుచుకుపడింది. దీంతో కళ్యాణ వేదిక కుప్పకూలిపోగా.. మండపం ఏర్పాటుకు వేసిన ఐరన్ గొట్టం విద్యుత్ స్తంభంపై పడింది. విద్యుత్ సరఫరా కావడంతో దాన్ని పట్టుకున్న ఉన్న వ్యక్తులు విద్యుదాఘాతానికి గురయ్యారు. వీరిలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. హనుమాన్‌పూర్ గ్రామానికి చెందిన రాజేంద్ర అనే వ్యక్తి కుమార్తెకు శుక్రవారం రాత్రి వివాహం జరిగింది. కార్యక్రమం ముగిసిన కొద్ది సేపటికే పిడుగులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. కళ్యాణ వేదిక కూలిపోవడంతో ఓ ఐరన్ పైప్ విద్యుత్ వైర్లును తాకింది. దీంతో అక్కడున్న ఏడుగురు విద్యుత్ షాక్‌కు గురికాగా.. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత స్వల్ప తొక్కిసలాట చోటుచేసుకుంది. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరిస్థితి విషమంగా ఉండటంతో సీతాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నలుగురు చనిపోయారు. వీరిని మయారామ్, రాధే (52), రామౌతార్ (38), రామచంద్ర (40)గా గుర్తించారు. వీరంతా వివాహానికి హాజరైన బంధువులే కావడం బాధాకరం. అప్పటి వరకూ ఆనందంగా ఉన్నవారు ఈ ఘటన జరగడంతో శోక సంద్రంలో మునిగిపోయారు.


By May 29, 2021 at 10:07AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/four-dead-due-to-electrocution-during-a-wedding-ceremony-in-ups-sitapur/articleshow/83056422.cms

No comments