Breaking News

ఏపీ, తెలంగాణకు షాకిచ్చిన ఒడిశా.. కొత్త నిబంధనలు, వివరాలివే


తెలుగు రాష్ట్రాలకు పొరుగునే ఉన్న ఒడిశా షాకిచ్చింది. ఏపీ, తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రాష్ట్రాలతో ఉన్న సరిహద్దులను మూసివేసింది.. ఆంక్షలను అమలులోకి తీసుకువచ్చింది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలకు 14 రోజుల క్వారంటైన్‌ను తప్పని సరి చేసింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సరిహద్దుల్లో ఒడిశాలోకి రాకుండా.. బయటకు వెళ్లకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వ్యక్తిగత, అద్దె వాహనాలు, రైళ్లు, విమానాల్లోనూ రాష్ట్రానికి వస్తే క్వారంటైన్ తప్పనిసరి. గంజాం, గజపతి, రాయగడ, కోరాపుట్, మల్కన్ గిరి, నబరంగ్ పూర్ జిల్లాల కలెక్టర్లు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్న వాళ్లు లేదా 48 గంటల ముందు ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో కరోనా నెగిటివ్ వచ్చినవాళ్లకు మాత్రం క్వారంటైన్‌ గడువును 7 రోజులకు తగ్గించింది. కరోనా అత్యవసర విధులు నిర్వహించే వారితో పాటు ప్రైవేటు ఆస్పత్రులు, ఒడిశా ప్రభుత్వంతో పనుల నిమిత్తం వచ్చేవారికి వీటి నుంచి మినహాయింపు ఇచ్చారు. వారంతా కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. ఒడిశాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో సీఎం నవీన్‌ పట్నాయక్‌ లాక్‌డౌన్‌ విధించారు. బుధవారం నుంచి అమలులోకి రాగా.. 19 వరకు అమలులో ఉండనుంది. విద్యా సంస్థలు, దుకాణాలు, సినిమా హాళ్ళు, మాల్స్, మార్కెట్ కాంప్లెక్స్, వ్యాయామశాలలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులు, థియేటర్లు, పార్కులు, బార్లు సహా అన్ని మూతపడ్డాయి. అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు.


By May 05, 2021 at 10:23AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/odisha-govt-restrictions-in-andhra-pradesh-and-telangana-border/articleshow/82399328.cms

No comments